గుడివాడలో హీట్ పెంచుతున్న రావి..కొడాలిపై పోరు..!

చాలాకాలం పాటు సైలెంట్ గా ఉన్న గుడివాడ టీడీపీ ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావు గత కొంతకాలం నుంచి గుడివాడలో దూకుడుగా పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో రావికి కాకుండా దేవినేని అవినాష్‌కు సీటు ఇచ్చిన విషయం తెలిసిందే. దేవినేని ఓడిపోయాక వైసీపీలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ రావిని తీసుకొచ్చి ఇంచార్జ్ గా పెట్టారు. అటు వైసీపీ అధికారంలో ఉండటం, కొడాలి మంత్రిగా ఉండటంతో రావి పెద్దగా బయటకు రాలేదు. అసలు గుడివాడలో టీడీపీ ఉందా? అనే పరిస్తితి కనిపించింది. కానీ […]

లోకేష్ టీం వర్క్: పాదయాత్రతో భారీ స్కెచ్..!

తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో బలపడాలన్న..టీడీపీకి గెలుపు అవకాశాలు మెరుగు పడాలన్న..వైసీపీకి చెక్ పెట్టాలన్న..ఇంకా అధినేత చంద్రబాబు కష్టపడాలి. ఆయన ఇప్పటికే సాధ్యమైన మేర కష్టపడుతున్నారు. ఆయనకు అండగా కొందరు ఇంచార్జ్‌లు బాగానే కష్టపడుతున్నారు గాని..కొందరు ఇంకా కష్టపడాలి. ఇటు లోకేష్ సైతం తనదైన శైలిలో ముందుకెళుతున్నారు. అయితే పార్టీ ఇంకా గాడిలో పడటానికి బాబు..లోకేష్ చేత పాదయాత్రకు ప్లాన్ చేయించిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో పాదయాత్ర అనేది పార్టీలకు బాగా అడ్వాంటేజ్ అవుతుంది. అందుకే జనవరి […]

గుంటూరు వైసీపీలో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు..!

మూడు రాజధానులతో మూడు ప్రణతల్లో రాజకీయంగా పైచేయి సాధించవచ్చనే ప్లాన్ అధికార వైసీపీ వేసిన విషయం తెలిసిందే..అయితే ఈ ప్లాన్ పెద్దగా వర్కౌట్ అవుతున్నట్లు కనిపించడం లేదు. ఎలాగో గొడవ లేకుండా అమరావతి రాజధానిగా ఉంటే..మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల మధ్య చిచ్చు రేగినట్లు కనిపిస్తోంది. ఈ కాన్సెప్ట్ వల్ల వైసీపీకి కాస్త నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతి ప్రాంత పరిధిలో వైసీపీకి భారీగానే నష్టం జరిగేలా ఉంది. అది కూడా గుంటూరు జిల్లాలో […]

పొన్నూరు లెక్కలు ఇవే..ఈ సారి వైసీపీకే..?

ఈ సారి ఎన్నికల్లో టీడీపీ కంచుకోటలు మళ్ళీ రివర్స్ అవ్వనున్నాయి. గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో పలు టీడీపీ కంచుకోటలని వైసీపీ కైవసం చేసుకుంది. అలాంటి కంచుకోటల్లో పొన్నూరు కూడా ఒకటి. 1983 నుంచి 2014 వరకు టీడీపీ ఇక్కడ ఓడిపోలేదు. వరుసగా ఐదు సార్లు ధూళిపాళ్ళ నరేంద్ర గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో కేవలం 1200 ఓట్ల తేడాతో కిలారు రోశయ్య గెలిచారు. ఇక ఎమ్మెల్యేగా రోశయ్య..ఈ మూడున్నర ఏళ్లలో పొన్నూరులో చేసిన అభివృద్ధి లేదు..తక్కువ […]

చిత్తూరులో అభ్యర్ధి కోసం తిప్పలు..టీడీపీకే మైనస్..?

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టి ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలని అనుకుంటున్న టీడీపీకి..ఇంకా కొన్ని స్థానాల్లో సరైన అభ్యర్ధులు లేకపోవడం ఆ పార్టీ శ్రేణులని కలవరపెడుతున్న విషయం. గత ఎన్నికల్లో ఓడిపోయాక చాలా చోట్ల అభ్యర్ధులని పెట్టుకుని వచ్చారు..కొన్ని చోట్ల అభ్యర్ధులని మార్చారు. అయితే మూడున్నర ఏళ్ళు అయినా ఇంకా కొన్ని స్థానాల్లో ఇంచార్జ్‌లు లేకపోవడం టీడీపీకి మింగుడు పడని విషయం. అది కూడా అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కొన్ని స్థానాల్లో ఇంచార్జ్‌లు […]

గుడివాడలో కొడాలి కాన్ఫిడెన్స్ తగ్గుతుందా?

తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న గుడివాడని తన అడ్డాగా మార్చుకుని, వైసీపీ జెండా రెండుసార్లు గుడివాడ గడ్డపై ఎగిరేలా చేసిన కొడాలి నాని…మరొకసారి గెలిచి సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే ఇంతకాలం గుడివాడలో కొడాలికి అనుకూల వాతావరణం ఉన్నట్లే కనిపించింది..కానీ ఇటీవల కాలంలో సీన్ మారిపోతూ వస్తున్నట్లు కనిపిస్తోంది. నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ కొడాలి గెలిచేస్తారనే కాన్ఫిడెన్స్ ఇక్కడ ఉన్న వైసీపీ శ్రేణుల్లో కనిపించడం లేదు. ఏదో కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్ మాత్రం..గుడివాడ గడ్డ..కొడాలి అడ్డా […]

పవన్‌తోనే భీమవరం..మారిన లెక్కలు..!

ఏపీ రాజకీయాల్లో భీమవరం నియోజకవర్గం అంటే అదొక ప్రత్యేకమైన స్థానంగా చూస్తారు..పూర్తి రాజకీయ చైతన్యం ఉన్న ఈ స్థానంలో గెలుపోటములని మొదట నుంచి కాపు, క్షత్రియులే డిసైడ్ చేస్తారు. అయితే కాపు ఓట్లు ఎక్కువ ఉన్నాయనే పవన్ కల్యాణ్..2019 ఎన్నికల్లో గాజువాకతో పాటు భీమవరంలో కూడా పోటీ చేశారు. కానీ రెండు చోట్ల అనూహ్యంగా ఓడిపోయారు. భీమవరంలో సొంత వర్గం వారే పవన్‌కు పూర్తి స్థాయిలో ఓట్లు వేసినట్లు కనిపించలేదు. అందుకే భీమవరంలో ఓటమి ఎదురైంది. కానీ […]

అఖిలప్రియకు బాబు హ్యాండ్…తేల్చేసినట్లేనా?

కర్నూలు జిల్లాలో భూమా ఫ్యామిలీ గురిచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్ల నుంచి ఆళ్లగడ్డ-నంద్యాల లాంటి నియోజకవర్గాల్లో సత్తా చాటుతున్న ఫ్యామిలీ. అయితే భూమా ఫ్యామిలీ వారసులు వచ్చాక రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఆళ్లగడ్డలో అఖిలప్రియ, నంద్యాలలో బ్రహ్మానందరెడ్డి ఓటమి పాలయ్యారు. ఇప్పటికీ వారు పుంజుకున్నట్లు  కనిపించడంలేదు. ఇదే క్రమంలో సీట్ల విషయంలో వారి మధ్య అంతర్గత పోరు కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు […]

టీడీపీ సీనియర్ చూపు..జనసేన వైపు..సీటు దక్కేనా?

ఈ మధ్య జనసేనలో కొన్ని సీట్లకు డిమాండ్ పెరిగింది..గత ఎన్నికల్లో దాదాపు 30 వేల పైనే ఓట్లు తెచ్చుకున్న నియోజకవర్గాల్లో ఇప్పుడు జనసేన బలం పెరిగిందనే అంచనాలకు వస్తున్నారు. ఇప్పటికే 6 శాతం ఓటు బ్యాంక్ వచ్చిన జనసేనకు ఇప్పుడు 12 శాతం వరకు వచ్చిందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో కొన్ని సీట్లలో త్రిముఖ పోరు ఉన్నా సరే జనసేన గెలుస్తుందనే ప్రచారం వస్తుంది. అలాగే టీడీపీతో పొత్తు ఉంటే కొన్ని సీట్లని జనసేనకు కేటాయించాలి. అలా […]