ఈ సారి ఎన్నికల్లో టీడీపీ కంచుకోటలు మళ్ళీ రివర్స్ అవ్వనున్నాయి. గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో పలు టీడీపీ కంచుకోటలని వైసీపీ కైవసం చేసుకుంది. అలాంటి కంచుకోటల్లో పొన్నూరు కూడా ఒకటి. 1983 నుంచి 2014 వరకు టీడీపీ ఇక్కడ ఓడిపోలేదు. వరుసగా ఐదు సార్లు ధూళిపాళ్ళ నరేంద్ర గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో కేవలం 1200 ఓట్ల తేడాతో కిలారు రోశయ్య గెలిచారు.
ఇక ఎమ్మెల్యేగా రోశయ్య..ఈ మూడున్నర ఏళ్లలో పొన్నూరులో చేసిన అభివృద్ధి లేదు..తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఇక్కడ పలు అక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇటు ధూళిపాళ్ళ ఇంకా బలపడ్డారు..క్యాడర్ని చేజారినివ్వలేదు..జనంలోనే ఉన్నారు..జైలుకు వెళ్ళడంతో సింపతీ పెరిగింది. ఓవరాల్ గా పొన్నూరులో ధూళిపాళ్ళ మళ్ళీ పుంజుకున్నారు.
అయితే పొన్నూరులో ఒకసారి రాజకీయ సమీకరణాలు చూస్తే..ఇక్కడ మాస్ ఇమేజ్ ఉన్న ధూళిపాళ్ళకే ఎడ్జ్ ఉంది. నియోజకవర్గంలో దాదాపు 40 గ్రామాలు, ఒక టౌన్ ఉంది. దాదాపు 25 పైనే గ్రామాల్లో టీడీపీకి బలం కనిపిస్తోంది. అలాగే ఇక్కడ కమ్మ, కాపు వర్గం ఓట్లు ఎక్కువ. కమ్మ ఓట్లు దాదాపు ధూళిపాళ్ళ వైపే. ఇక జనసేనతో పొత్తు ఉంటే కాపు ఓట్లు ప్లస్. బీసీ, ఎస్సీ ఓట్లు లక్ష వరకు ఉంటాయి..అవి ఫిఫ్టీ-ఫిఫ్టీ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ సారి ఎస్సీ ఓట్లలో కూడా మార్పు కనిపిస్తోంది.
వారు వైసీపీపై అసంతృప్తిగానే కనిపిస్తున్నారు..కాబట్టి ఈ సారి అనుకున్న రీతిలో ఎస్సీ ఓట్లు వైసీపీకి పడటం కష్టం. ఇక్కడ ముస్లింల ఓట్లు కూడా బాగానే ఉన్నాయి. వీరు కూడా ఫిఫ్టీ-ఫిఫ్టీగా ఉండవచ్చు. మొత్తం మీద చూసుకుంటే ఈ సారి పొన్నూరులో నరేంద్రకు గెలుపు అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ జనసేన సెపరేట్ గా పోటీ చేసిన నరేంద్ర వైపే మొగ్గు కనబడుతోంది. ఈ సారి పొన్నూరు ప్రజలు వైసీపీకే షాక్ ఇచ్చేలా ఉన్నారు.