ప్రియాంక జవాల్కర్ ఈ హీరోయిన్ పుట్టి పెరిగిందంతా అనంతపూర్ లోనే.. ఈమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ మరాఠీ ఈమె హైదరాబాద్ లో షిఫ్ట్ అయ్యి అక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది. వీరు మరాఠీ అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోనే పుట్టి పెరగటం వల్ల ఆమెకు ఇక్కడ వాతావరణం బాగా అలవాటయింది. ప్రియాంక సినీ కెరీర్ లోకి అడుగుపెట్టినప్పుడు తెలుగు అమ్మాయిల లాగానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటగా ప్రియాంక మోడలింగ్ గా పనిచేస్తూ ఉండేది.. కానీ అటువైపు వెళ్ళలేదు. చదువు పూర్తి కాగానే అమెరికా వెళ్లి ఉద్యోగం కూడా చేసిందట.
ఆ తరువాత సినిమాలపై ఇష్టం ఉండడంవల్ల అక్కడికి వెళ్లినా కూడా సినిమా అవకాశాల కోసం పలు ప్రయత్నాలు చేస్తూ ఉండేదట. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది.. అమెరికా నుంచి మళ్లీ తిరిగి వచ్చిన తర్వాత టాలీవుడ్ లో సినిమాలు చేయాలని చాలా ప్రయత్నాలు చేసింది. అలాంటి సమయంలోనే ప్రియాంక మొదటి సినిమా 2018లో టాక్సీవాలాతో మొదలుపెట్టింది. ఆ సినిమా సక్సెస్ కావటంతో ఆమెకు అవకాశాల బాగానే అనుకుంది. అటు తరువాత SR. కళ్యాణ మండపం సినిమాలతో బాగానే ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత అవకాశాలు రాలేదు.
ఇక సినిమాల గురించి పక్కన పెడితే కాస్త గ్లామరస్ పాత్రలు కూడా చేసేందుకు రెడీగా ఉన్నానంటూ ఆ ఉద్దేశంతోనే సోషల్ మీడియాలో పలు హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది ప్రియాంక. ఇటీవల అమ్మడు చిన్న గౌన్లో ఊహించని విధంగా కనిపించింది. ట్రెండింగ్ స్టైల్లో మెప్పిస్తున్న ప్రియాంక అందంలో మాత్రం మంచి మార్కులు సంపాదించింది.. కానీ సినిమా లో ఆమె కెరీర్ ను మార్చే అవకాశాలు ఏమీ రావడం లేదు. ప్రస్తుతం ప్రియాంక ఒక తెలుగు సినిమాకు సంబంధించి చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. అలాగే వెబ్ సిరీస్ అవకాశాలు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఎప్పుడైనా ఈ ముద్దుగుమ్మ కెరియర్ మారుతుందేమో చూడాలి.
View this post on Instagram