తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో బలపడాలన్న..టీడీపీకి గెలుపు అవకాశాలు మెరుగు పడాలన్న..వైసీపీకి చెక్ పెట్టాలన్న..ఇంకా అధినేత చంద్రబాబు కష్టపడాలి. ఆయన ఇప్పటికే సాధ్యమైన మేర కష్టపడుతున్నారు. ఆయనకు అండగా కొందరు ఇంచార్జ్‌లు బాగానే కష్టపడుతున్నారు గాని..కొందరు ఇంకా కష్టపడాలి. ఇటు లోకేష్ సైతం తనదైన శైలిలో ముందుకెళుతున్నారు. అయితే పార్టీ ఇంకా గాడిలో పడటానికి బాబు..లోకేష్ చేత పాదయాత్రకు ప్లాన్ చేయించిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో పాదయాత్ర అనేది పార్టీలకు బాగా అడ్వాంటేజ్ అవుతుంది.
అందుకే జనవరి నుంచి లోకేష్ చేత పాదయాత్ర ప్లాన్ చేయించారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర సాగుతుంది. ఈ పాదయాత్ర ద్వారా టీడీపీకి దూరమైన వర్గాలు మళ్ళీ దగ్గర చేరడం, వైసీపీపై అసంతృప్తిగా ఉన్న వర్గాలని కలుపుకుని వెళ్లనున్నారు. అయితే ఈ పాదయాత్ర ద్వారా లోకేష్ టీం భారీ స్కెచ్‌తో ముందుకొస్తుంది. ప్రధానంగా నాలుగు అంశాలని టార్గెట్ గా పెట్టుకుంది. మొదట నిరుద్యోగ యువతని దగ్గర చేర్చుకోవడ, రైతులు, మహిళలని కూడా టీడీపీ వైపుకు వచ్చేలా చేయడం, అటు ఈ మూడున్నర ఏళ్ళు కేసులతో ఇబ్బందులు పడి..ఇంకా పార్టీ తరుపున పోరాడుతున్న కార్యకర్తలకు సమయం ఇవ్వడం.
మొదట రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారనే డేటా లోకేష్ టీం సేకరిస్తుంది..దీని ద్వారా పాదయాత్రలో నిరుద్యోగులు భగస్వామ్యం అయ్యేలా చేయడం..వారితో ఇంటరాక్ట్ అవ్వడం, కాలేజీల్లో యువతని కలవడం లాంటివి చేయనున్నారు. ఇటు బూత్ లెవెల్లోని కార్యకర్తలతో ప్రతిరోజూ పాదయాత్ర ముగిశాక లోకేష్..సమావేశమయ్యేలా ప్లాన్ చేయనున్నారు.
పాదయాత్ర పొలాల మీదుగా వెళ్ళడం, రైతులని కలవడం, వారి సమస్యలని తెలుసుకోవడం లాంటివి చేయనున్నారు. ఇక ప్రధానంగా మహిళలతో ఇంటరాక్ట్ అవ్వడం. జగన్ ప్రభుత్వం పథకాల వల్ల మహిళలు చాలా వరకు సంతృప్తిగానే ఉన్నారు..ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు. వారికి పథకాల ద్వారా డబ్బులు పడటం తెలుస్తుంది గాని..పన్నుల ద్వారా ప్రభుత్వం ఎంత లాగుతుందనే అంశాలు పట్టించుకోవడం లేదు. ఈ అంశాలపై లోకేష్, మహిళలకు అవగాహన వచ్చేలా చేయాలని చూస్తున్నారు. మొత్తానికి పాదయాత్ర ద్వారా టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.