తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న గుడివాడని తన అడ్డాగా మార్చుకుని, వైసీపీ జెండా రెండుసార్లు గుడివాడ గడ్డపై ఎగిరేలా చేసిన కొడాలి నాని…మరొకసారి గెలిచి సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే ఇంతకాలం గుడివాడలో కొడాలికి అనుకూల వాతావరణం ఉన్నట్లే కనిపించింది..కానీ ఇటీవల కాలంలో సీన్ మారిపోతూ వస్తున్నట్లు కనిపిస్తోంది. నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ కొడాలి గెలిచేస్తారనే కాన్ఫిడెన్స్ ఇక్కడ ఉన్న వైసీపీ శ్రేణుల్లో కనిపించడం లేదు.
ఏదో కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్ మాత్రం..గుడివాడ గడ్డ..కొడాలి అడ్డా అంటున్నారు గాని, ఇక్కడ ఉన్న వైసీపీ శ్రేణులు పూర్తిగా కాన్ఫిడెన్స్‌తో లేరు. వారే కాదు తాజాగా కొడాలి నాని మాటలు చూసినా సరే..అదే అనిపిస్తుంది. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంలో..చంద్రబాబు, నారా లోకేష్‌లు వచ్చి పోటీ చేసినా కూడా తాను వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉంటానని చెప్పుకొచ్చారు.
అదే సమయంలో కుల సంఘాల చందా డబ్బులు వేల కోట్లు తెచ్చినా, చివరి రక్తపు బొట్టు వరకూ వైసీపీ గెలుపు కోసం పోరాడుతానని, గుడివాడలో గెలుపోటములను ప్రజలు నిర్ణయిస్తారు తప్ప, ఎన్నారైలు, పొలిటికల్ ఎనలిస్టులు కాదని అన్నారు. వందల కోట్ల డబ్బు తెస్తే గుడివాడ ప్రజలు అమ్ముడు పోరని చెప్పుకొచ్చారు. అంటే ఇక్కడ కొడాలిని ఓడించడానికి టీడీపీ ఎన్ఆర్ఐలు గట్టిగా కృషి చేస్తున్నట్లు కనిపిస్తోంది. మామూలుగా ఎన్నికల సమయంలోనే కొంతమంది ఎన్ఆర్ఐలు పార్టీ కోసం పనిచేస్తారు.
కానీ కొడాలి నాని అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు, లోకేష్‌లని బూతులు తిడుతూ వస్తున్నారు. అటు పరోక్షంగా భువనేశ్వరిపై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు నానిని ఓడించాలని బాగా కసితో ఉన్నాయి. అటు ఎన్ఆర్ఐలు సైతం గుడివాడపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇటు టీడీపీ తరుపున రావి వెంకటేశ్వరరావు ఇటీవల కాలంలో దూకుడుగా పనిచేస్తున్నారు. తానే అభ్యర్ధిగా ఉంటానని చెప్పుకొచ్చారు. టీడీపీ గెలుపు కోసం ఎన్ఆర్ఐలు భారీగానే ఖర్చు పెట్టేలా ఉన్నారు.
ఇటు కొడాలి సైతం ఆర్ధికంగా బలంగానే ఉన్నారు. అయినా సరే మంత్రిగా ఉండి కూడా గుడివాడని అనుకున్న రీతిలో అభివృద్ధి చేయకపోవడం ..మొన్నటివరకు అధికారంలో లేనని చెప్పుకొచ్చి కవర్ చేసుకున్నారు..కానీ ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఏం చేశారనే ప్రశ్నలు వస్తున్నాయి. పైగా చంద్రబాబుని బూతులు తిట్టడం లాంటివి మైనస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే గెలుపుపై కొడాలికి కాస్త కాన్ఫిడెన్స్ తగ్గిందా? అన్నట్లు కనిపించింది. అయినా గుడివాడలో కొడాలి బలం తక్కువ అంచనా వేయడానికి లేదు. చూడాలి మరి ఈ సారి గుడివాడలో రాజకీయం ఎలా ఉంటుందో.