తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైన పాటలు పాడి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది సింగర్ మంగ్లీ. ఇప్పుడు తాజాగా టీటీడీ చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సలహాదారునిగా ఆమెను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి ఉత్తర్వులను కూడా జారీ చేసింది SVBC. నాలుగు రోజుల క్రితమే మంగ్లీ కి ఈ పదవి బాధ్యతలు స్వీకరించినట్లు తెలుస్తోంది. ఈ పదవి నిర్వహిస్తున్నందుకు తనకు నెలకు లక్ష రూపాయల వేతనం కూడా ఇవ్వనున్నారు. ఈమెకు ఈ పదవి ఇవ్వడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
సింగర్ మంగ్లీ మొదటి నుంచి కష్టపడి పైకి వచ్చిందని చెప్పవచ్చు. బోనాల పాటలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీ ఆ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు ఎన్నో అద్భుతమైన పాటలు పాడింది. దీంతో కోట్లాదిమంది అభిమానులను కూడా సంపాదించుకున్నది. కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా ఇమే ఎన్నో పాటలు పాడింది.అయితే ఈమె పాడిన పాటల లో రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న అనే పాటకు ఈమె బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. దాంతో ఈ పాట పాపులారిటీ కావడంతో మరింత పాపులర్ అయింది.
ఇప్పుడు తాజాగా ఈ పదవి రావడానికి కారణం కూడా అదే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. లంబాడి సామాజిక వర్గానికి చెందిన ఈమె తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా నుంకిడి అనే గ్రామంలో జన్మించింది. 28 ఏళ్ల వయసులోనే తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సలహాదారునిగా నియమితులవ్వడం జరుగుతోంది దీంతో ప్రతి ఒక్కరు కూడా ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. వాస్తవానికి మార్చి నెలలోనే ఆమెను సలహాదారునిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కానీ అప్పట్లో ఈ విషయం వెలుగులోకి రాలేదు.