హాస్యాన్ని పండించడంలో మా నాన్నే నాకు ఆదర్శం ఇంకా స్ఫూర్తి అంటోంది అందాల భామ నటి రాశీ ఖన్నా. ఇటీవల గోపీచంద్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న పక్కా కమర్షియల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది రాశీ. లాయరు పాత్రలో కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలో తనకి నవ్వించడం చాలా ఈజీ అని, ఏదో పాత్ర కోసం నటించాలని కాకుండా సహజంగానే కామెడీని పండిస్తానని చెప్తుంది ఈ బ్యూటీ. అందరూ హాస్యభరిత సీన్స్ చెయ్యటం చాలా […]
Author: Admin
దర్శకుడు మారినా హీరోయిన్‌ను మార్చని ఎన్టీఆర్?
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న ఎన్టీఆర్.. తన 30వ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేస్తాడని జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు, ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియరా అద్వానిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే అనూహ్యంగా ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించాడు. జూన్‌లో పట్టాలెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల కానుంది. అయితే దర్శకుడిని మార్చిన ఎన్టీఆర్ హీరోయిన్‌ను […]
అంజలిని వదలని నిర్మాత..ముచ్చటగా మూడోసారి..?
అంజలి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగు అమ్మాయే అయినా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. `ఫొటో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ..ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో కొన్ని సినిమాలు నటించినా పెద్దగా క్లిక్ అవ్వకపోవడంతో.. ఇక్కడ ఆమె కెరీర్ పూర్తిగా డల్ అయింది. అలాంటి తరుణంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన `సీతమ్మ […]
భారత్‌లో కరోనా స్వయంవిహారం..కొత్తగా 1.84 లక్షల కేసులు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్‌లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 1,61,736 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,36,89,453 కు చేరుకుంది. అలాగే నిన్న 879 మంది […]
తెలంగాణలో 3,34,738కి చేరిన కరోనా కేసులు..తాజా లెక్క ఇదే!
ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న రెండు వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో […]
నాని తప్పుకోవడంతో..బరిలోకి దిగిన `జాంబి రెడ్డి` హీరో!
న్యాచురల్ స్టార్ నాని, శివ నిర్వణ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `టక్ జగదీష్`. రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చత్రం ఏప్రిల్ 23న విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా నాని మరియు చిత్ర టీమ్ విడుదల తేదీని వాయిదా వేశారు. అయితే ఇప్పుడు అదే తేదీనా జాంబి రెడ్డి […]
మరోసారి డబుల్ రోల్ చేయబోతున్న గోపీచంద్?
యాక్షన్ హీరో గోపీచంద్ త్వరలోనే ప్రముఖ దర్శకుడు తేజతో `అలిమేలు మంగ వెంకటరమణ` అనే టైటిల్‌తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. జయం, నిజం సినిమాల తర్వాత గోపీచంద్, తేజ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. అయితే ఆ చిత్రాల్లో విలన్‌గా నటించిన గోపీచంద్ ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుందని బలంగా టాక్ వినిపిస్తోంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం గురించి ఓ ఇంట్రస్టింగ్ […]
ఎన్టీఆర్‌తో కొరటాల..మరి బన్నీ సినిమా ఎప్పుడంటే?
ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివతో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన రాగా.. ఈ చిత్రం జూన్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల కానున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్‌రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రంగా నిర్మించనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన వెంటనే స్టైలిష్ […]
వైరల్ పిక్: బండ్ల గణేష్‌కి కరోనా..సుమ ముందు జాగ్రత్తే మంచిదైంది!
సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ రెండో సారి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. `వకీల్ సాబ్` సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వెళ్లి వచ్చిన మరుసటి రోజు నుంచి ఒళ్లు నొప్పులు, జ్వరంతో బాధ పడుతున్న బండ్ల కరోనా టెస్ట్‌లు చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచి బండ్ల గణేశ్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా […]