ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న ఎన్టీఆర్.. తన 30వ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేస్తాడని జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు, ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియరా అద్వానిని హీరోయిన్గా ఎంపిక చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి.
అయితే అనూహ్యంగా ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించాడు. జూన్‌లో పట్టాలెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల కానుంది. అయితే దర్శకుడిని మార్చిన ఎన్టీఆర్ హీరోయిన్ను మాత్రం మార్చడం లేదు.
ఈ చిత్రంలోనూ కియరానే తీసుకోవాలని ఎన్టీఆర్ భావిస్తున్నారట. పాన్ ఇండియా సినిమా కావడంతో.. అటు టాలీవుడ్లో, ఇటు బాలీవుడ్లో క్రేజ్ ఉన్న కియరా అయితేనే బాగా సెట్ అవుతుందని.. అందుకే ఆమె డేట్ ల కోసం ట్రయ్ చేయమని ఎన్టీఆర్ స్వయంగా కొరటాలకు చెప్పారట. దీంతో ప్రస్తుతం ఆమెను సంప్రదించే పనుల్లో ఉన్నట్టు టాక్ నడుస్తోంది.