శ్రీ లీల ..శ్రీ లీల ..శ్రీ లీల ఏం మాయ చేసిందో తెలియదు కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ పేరు పెద్ద వైరస్ లా పాకేస్తుంది . సినిమా ఇండస్ట్రీకి పట్టిన వైరస్ శ్రీ లీల అని అనాలో ..సినిమా ఇండస్ట్రీకి ఓ దేవతల దొరికిన అదృష్టం శ్రీ లీలా అనాలో తెలియదు. కానీ అందరూ ఇప్పుడు శ్రీలీల పేరు జపిస్తూ ఉండడం వినడానికి కొన్నిసార్లు బాగానే అనిపిస్తున్న మరికొన్నిసార్లు వెటకారంగా అనిపిస్తూ ఉంటుంది .
కాగా ప్రజెంట్ శ్రీలీల నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూ ఉండడంతో మేకర్స్ ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది . అయితే ఆమెతో మూవీ కమిట్ అయిన మేకర్స్ మాత్రం ఆ విషయాలను అస్సలు పట్టించుకోవడం లేదు. శ్రీ లీల పేరునే జపిస్తూ వస్తున్నారు. కాగా రీసెంట్గా నటించిన ఆది కేశవ అలాగే ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమాలు బోల్తా కొట్టాయి . మేకర్స్ కి బాగా నష్టాలు వచ్చాయి .
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమె పేరు కూసింత ట్రోలింగ్ కి గురవుతుంది . కాగా శ్రీలీల గుంటూరు కారం సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే . ఇక మహేష్ బాబు ఆమెకు హిట్ కి దిక్కు అన్న రేంజ్ లో కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . అంతేకాదు ఈ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని శ్రీలీల ఈ సినిమాలో చాలా నేచురల్ యాక్టింగ్ తో నటించిందట.
అంతేకాదు ఈ సినిమాలో శ్రీ లీల ఓ మధ్యతరగతి అమ్మాయిగా కనిపించబోతుందట . ఫారిన్ కంట్రీస్ లో చదువుకోవాలని ఆశ ఉండే అమ్మాయిను పల్లెటూరి కట్టుబాట్లు కారణంగా ఇంట్లోనే తొక్కేస్తే ఎలా ఉంటుందో ఆ పాత్రలో శ్రీలీల కనిపించబోతుందట . అంతేకాదు ఈ పాత్రలో న్యాచురల్ గా కనిపించడానికి శ్రీ లీల ఇంటి పని ..వంట పని కూడా చేసిందట . ఇల్లు కూడా ఊడ్చి ముగ్గు పెట్టిందట . రియల్ గానే అదంతా చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . కొందరు హిట్ కోసం శ్రీలీల ఏమైనా చేస్తుంది ముదురు పిల్ల అంటున్నారు..!!