టాలీవుడ్ ఇండస్ట్రీలో నితిన్ కి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆయన నటించిన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ నే ఎక్కువగా ఆకట్టుకుంటాయి అన్న మాటలు ఆయన సినిమా రిలీజ్ అయిన ప్రతి టైంలో వినపడతాయి. అయితే గత కొంతకాలం నుంచి హిట్లు లేక అల్లాడిపోతున్న నితిన్ తాజాగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ అనే సినిమా చేశాడు .
ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సినిమా కధ, కంటెంట్ విషయం పక్కనపెడితే సినిమాకి వెళ్లిన ప్రతి ఒక్కరు కడుపుబ్బ నవ్వుకొని బయటికి వచ్చామని చెప్పుకుంటున్నారు . మరి ముఖ్యంగా యాక్షన్స్ – ఫైట్ – రొమాన్స్ ఇలాంటి సినిమాలే ఈ మధ్యకాలంలో వస్తూ ఉండగా .. మంచి కామెడీ ఎంటర్టైనర్ సినిమా రావడం అది కూడా నితిన్ యాక్ట్ చేయడం అభిమానులకు బాగా నచ్చేసింది .
ఈ సినిమా అంతా బాగానే ఉన్నా హీరోయిన్ శ్రీ లీల పాత్ర మాత్రం బిస్కెట్ గా మారింది అంటున్నారు సిజనాలు. కొన్ని సీన్స్ పాటలకు తప్పిస్తే..నిమాలో ఆమె పాత్ర ఎందుకు ఉంది అన్న కామెంట్ లే వినిపిస్తున్నాయి . సినిమా మొత్తానికి కర్త – కర్మ – క్రియ అన్ని నితిన్ పోషించి సినిమాను హిట్ చేశాడు..!!