మరో జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన మీనాక్షి చౌదరి..కలలో కూడా ఊహించని ఛాన్స్ ఇది..!!

మీనాక్షి చౌదరి ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ అమ్మడు హవా ఎక్కువగా కనిపిస్తుంది . నిన్న మొన్నటి వరకు అమ్మడు పేరు కూడా సరిగ్గా పలకలేని జనాలు.. ఇప్పుడు అమ్మడు నువ్వు ఓ రేంజ్ లో పొగిడెస్తున్నారు .మరి ముఖ్యంగా గుంటూరు కారం సినిమాలో ఆఫర్ అందుకున్న తర్వాత మీనాక్షి చౌదరి పేరు మారుమ్రోగిపోతుంది. గుంటూరు కారం సినిమాలో శ్రీలీల ప్లేస్ లో రీప్లేస్ చేసిన మీనాక్షి చౌదరి.

ఆ తర్వాత ఏకంగా నాలుగు ప్రాజెక్టులలో భాగమైపోయింది మీనాక్షి చౌదరి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ ఇదే న్యూస్ సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

రౌడీ హీరో లాంటి విజయ్ దేవరకొండ సరసన మీనాక్షి చౌదరి ఆఫర్ దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. కలలో కూడా ఆమె ఊహించని ఆఫర్ ఇది అంటూ విజయ్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. అంతేకాదు ఈ మూవీ లో అమ్మడు చాలా హాట్ గా కనిపించబోతుందట..!!