బాబు మొహ‌మాటంతో పోయే సీట్లు ఇవే..!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి గెలుపుగుర్రాల‌కు మాత్ర‌మే టికెట్లు ఇస్తాన‌ని.. టీడీపీ అధినేత చంద్ర‌బా బు ప‌దే ప‌దే చెబుతున్నారు. ప్ర‌జ‌ల్లో ఉండేవారికి.. ప్ర‌జ‌ల‌తో జై కొట్టించుకునే వారికి మాత్ర‌మే టికెట్లు ద‌క్కుతాయ‌ని అంటున్నారు. ముఖ్యంగా యువ‌త‌కు టికెట్లు ఎక్కువ‌గా ఇస్తామ‌ని చెబుతున్నారు. అయి తే.. ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చే స‌రికిమాత్రం ఇది సాధ్య‌మేనా ? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే.. ఎన్నిక‌ల‌కు ఇంకా చాలానే స‌మ‌యం ఉంది.

With Rs 668 Crore, Chandrababu Naidu Among Richest Candidates In Andhra  Pradesh

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు చుట్టూ చేరిన కొంద‌రు సీనియ‌ర్లు ఆయ‌న‌ను మొహ‌మాటానికి గురి చేస్తున్నా రు. వ‌రుస ప‌రాజ‌యాలు ఎదుర‌వుతున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ట్టు సాదించాల‌ని.. చంద్ర‌బాబు గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తుంటే.. అవే స్థానాల‌ను త‌మ‌కు కేటాయించాల‌ని.. ఈ సారి వాటిలో విజ‌యం సాధించి గిఫ్ట్‌గా ఇస్తామ‌ని.. త‌మ‌ను న‌మ్మాల‌ని కూడా ఒత్తిడి పెరిగిపోయింద‌ట‌. ఇలాంటి వాటిలో .. క‌డ‌ప జిల్లా మైదుకూరు.. ఉమ్మ‌డి తూర్పులోని తునిపేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

మైదుకూరులో వ‌రుస ప‌రాజ‌యాలు పొందిన పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌, తునిలో య‌న‌మల కుటుంబాలే ఈ ఒత్త‌డి పెంచుతున్నాయ‌ని అంటున్నారు. అయితే.. మైదుకూరు ఇచ్చేది లేద‌ని.. చంద్ర‌బాబు తెగేసి చెప్పిన‌ట్టు స‌మాచారం. అయినా.. స‌రే.. త‌మ‌కు ఆ సీటు కావాల‌ని.. గెలిచి తీరుతామ‌ని.. సుధాక‌ర్ చెబుతున్నారు. ఇప్ప‌టికే రెండు సార్లు ఆయ‌న ఓడిపోవ‌డంతో పార్టీ కేడ‌ర కూడా ఆయ‌న్ను ఒప్పుకోవ‌డం లేదు.

పైగా ఆయ‌న‌కు చంద్ర‌బాబు పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చినా యూజ్ లేకుండా పోయింది. ఇక‌, తుని నుంచి త‌న‌కుమార్తెను రంగంలోకి దింపాల‌ని.. య‌న‌మ‌ల నిర్ణ‌యించుకున్నా ర‌ట‌. తునిలో 20 ఏళ్లుగా య‌న‌మ‌ల కుటుంబానికి గెలుపు అన్న‌దే లేదు. అయినా య‌న‌మ‌ల ఒత్తిడికి త‌లొగ్గేసి మ‌రి చంద్ర‌బాబు ఆయ‌న కుటుంబానికే సీటు ఇస్తున్నారు. దీంతో ఈ రెండుస్థానాల్లోనూ చంద్ర‌బాబు తీవ్ర మొహ‌మాటానికి పోతున్నార‌నేది సీనియ‌ర్ల మాట‌. మొహ‌మాటానికి పోతే.. పార్టీకి న‌ష్టం.. వైసీపీకి లాభం అని వ్యాఖ్యానిస్తున్నారు.