ప్రస్తుత లైఫ్ స్టైల్‌లో చాలామంది ఆహార విధానాల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. డయాబెటిస్, థైరాయిడ్, బిపి లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో తమ ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేసుకునేందుకు డైట్ ను ఫాలో అవుతూ రాత్రివేళ భోజనం మానేసి రోటీలను తినడం అలవాటు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఇది చాలామంది ఇళ్లల్లో సాధారణంగా జరుగుతుంది. అయితే ముందు రోజు రాత్రి మిగిలిపోయిన రోటీలను మరనాడు తినకుండా చాలా మందికి పడేసే అలవాటు ఉంటుంది. అయితే రాత్రి భోజనం తర్వాత మిగిలిన రోటీలను మర్నాడు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
అవేంటో ఒకసారి చూద్దాం. రాత్రి మిగిలిన రోటీలను ఉదయం తినడం వలన మధుమేహం, బరువు పెరగడం లాంటి ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. చాలామంది అప్పుడే పాన్ మీద నుంచి కాల్చి తీసిన వేడివేడి రోటీలను తినడానికి ఇష్టపడతారు. కానీ రాత్రి మిగిలిన పాత రోటీలను ఉదయాన్నే తినాలంటే ఏదైనా ప్రమాదం జరుగుతుందని, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని భయపడుతూ ఉంటారు. ఉన్న ఆకలిని కూడా చంపేసుకుంటూ ఉంటారు. అయితే రాత్రి మిగిలిన చపాతీలను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందట. రాత్రి మిగిలిన చపాతీలు మళ్ళీ నూనె పోసి వేయించకుండా అలాగే తినడం మంచిదని.. జీర్ణ క్రియలు మెరుగుపరుస్తుందని.. జీర్ణ సమస్యల నుంచి చెక్ పెడుతుందని, మలబద్ధక సమస్యలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇలా రాత్రి మిగిలిన రోటి తినడం వల్ల కడుపుఉబ్బరం, ఎసిడిటి సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. ఇది అధిక బరువును నియంత్రించడానికి సహకరిస్తుంది. ఎప్పటికప్పుడు పాన్ మీద నుంచి వేయించి తీసిన రోటితో పోలిస్తే సద్ది రొట్టెలు తక్కువ క్యాలరీలు ఉంటాయి. త్వరగా బరువు తగ్గడానికి సహకరిస్తాయి. రక్తపోటును నియంత్రించడానికి, మధుమేహ రోగులు ఉదయం పాలతో కలిపి అల్పాహారంగా తీసుకోవడానికి తోడ్పడుతుంది. తీసుకునే రోటీలలో కానీ పాలలో కానీ పంచదార వేసుకోకూడదని గుర్తుంచుకోండి. సత్తి రోటి తినడం వల్ల కండరాలు బలైతమయే పోషక విలువలను మరింతగా కలిగి ఉంటుంది. ముఖ్యంగా గోధుమలతో రోటి తయారు చేసినప్పుడు దాన్ని తినడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. పాలతో కలిపి గోధుమ రొట్టెను తీసుకోవడం వల్ల ఈ ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి.