అల్లు అర్జున్ ని చూసి బోరున ఏడ్చేసిన అభిమాని.. బన్నీ చేసిన పనికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్..!!

టాలీవుడ్ స్టార్ హీరోలుగా క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్, మహేష్ లాంటి వారికి తెలుగు ప్రేక్షకుల్లో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి సినిమాలు మొదటిరోజు థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి అంటే వీరి అభిమానులు చేసే హడావిడి అంత ఇంత ఉండదు. అది మన హీరోలకు అభిమానుల్లో ఉన్న క్రేజ్. అయితే చాలామంది టాలీవుడ్ హీరోలకు డై హార్ట్ ఫ్యాన్స్ కూడా ఉంటారు.

తాజాగా అల్లు అర్జున్ అలాంటి డై హార్ట్ ఫ్యాన్ ఒకరిని కలిశాడు. అల్లు అర్జున్‌ను క‌లిసిన, చూసిన ఆనందంలో ఆ అభిమాని తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. బన్నీని పట్టుకుని బోరున ఏడ్చేసాడు. దీంతో ఏడుస్తున్న అభిమానిని అల్లు అర్జున్ ఓదార్చడు. కన్నీళ్లు పెట్టుకుంటున్న అభిమానికి ధైర్యం చెప్పాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెటింట‌ తెగ ట్రెండ్ అవుతుంది. ఎంతైనా ఓ అభిమానిని దగ్గరకు తీసుకుని అలాంటి ఓదార్పునివ్వడం అనేది నెటిజన్స్‌కు ఆనందాన్ని కలిగిస్తుంది.

పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్నా.. అల్లు అర్జున్ కు ఎటువంటి గర్వం లేదని.. అభిమానిని ఎలా గౌరవించాలో ఆయనకు బాగా తెలుసు అంటూ ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బన్నీ తన ఫ్యాన్ తో బిహేవ్ చేసిన విధానాన్ని ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం బన్నీ చేసిన పనికి ఫాన్స్ అంత ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మా హీరో ఫ్యాన్స్‌కు ఇచ్చే గౌరవం ఇలా ఉంటుందంటూ తెగ ట్రెండ్ చేస్తున్నారు.