లావణ్య కాకుండా.. వరుణ్ ఫేవరెట్ హీరోయిన్ ఆమెనా.. ఎందుకంత స్పెషల్ అంటే..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల నటించిన తాజా మూవీ ఆపరేషన్ వాలంటైన్. ఈ మూవీ శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వంలో తెరకెక్కుతుంది. సోనీ పిక్చర్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్ద రినైస‌న్స్ పిక్చర్స్ సంయుక్తంగా టాలీవుడ్, బాలీవుడ్ లో ద్విభాషా సినిమాగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా మార్చి 1న‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. దేశంలో వైమానిక దళాల‌ వీరులు.. అలుపెరగని పోరాటం దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ సినిమాల్లో కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు.

Actor Varun Tej Speech At Gaganaala Song Launch Event | Operation Valentine  Movie | YouWe Media - YouTube

ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ పైలట్గా కనిపించనున్నాడు. హీరోయిన్ మానుషి చిల్లర రాడార్‌ ఆఫీస‌ర్గా క‌నిపించ‌నుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ఫస్ట్ లుక్, పోస్టర్‌లు ప్రేక్షకుల్లో అంచనాలను మరింతగా పెంచాయి. జనవరి 26న రిపబ్లిక్ డేకు ముందు దేశభక్తి రగిలించే ఫస్ట్ సింగిల్ వందేమాతరం సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. గగనాల తేలేను నీ ప్రేమలోనా అనే పాటతో అభిమానులను ఆకట్టుకున్నారు మేకర్స్.

Newlyweds Varun Tej and Lavanya Tripathi celebrate their first Diwali  together | Times of India

ఇల రిలీజ్ టైం ద‌గ్గ‌ర స‌డ‌టంతో ఆపరేషన్ వాలెంటైన్ మూవీ టీం ప్రమోషన్లతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల మల్లారెడ్డి కాలేజ్ విద్యార్థులతో మూవీ టీం ఇంట్రాక్ట్ అయ్యారు. ఈ సెషన్‌లో వరుణ్‌తేజ్ కు ఆసక్తికర ప్రశ్న ఎదురయింది. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటూ విద్యార్థులు వరుణ్‌ను ప్రశ్నించగా.. దానికి సమాధానం నేను నా ఫేవరెట్ హీరోయిన్ నే పెళ్లి చేసుకున్న ఏదైనా మంచి కథ వస్తే ఇద్దరం కలిసి నటిస్తాం.. మా ఇద్దరిలో మొదటి ప్రపోజ్ చేసింది నేనే అంటూ చెప్పుకొచ్చాడు. ఇక లావణ్య కాకుండా మరో హీరోయిన్ అంటే సాయి పల్లవి అని.. నాకు ఆమె అంటే చాలా అభిమానం అంటూ వివరించాడు.

Varun Tej, Sai Pallavi at Fidaa audio launch - Photos,Images,Gallery - 70115

అనంతరం మూవీ గురించి మాట్లాడుతూ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెలుగులో వస్తున్న మొదటి సినిమా ఇదే అనుకుంటా.. దేశం కోసం ఏది చేసినా గొప్పగానే ఉంటుంది. ఈ సినిమా మీ అందరిని ఆకట్టుకుంటుందని భావిస్తున్న.. అంటూ వివరించాడు. ఇక సాయి పల్లవి, వరుణ్ తేజ్ కలిసి ఫిదాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ టైం లో సాయి పల్లవి బిహేవియర్ వరుణ్ తేజ్ కు బాగా నచ్చిందట‌. అప్పటి నుంచి సాయి పల్లవి.. వరుణ్ ఫేవరెట్ హీరోయిన్ అని తెలుస్తుంది. కాగా . ప్రస్తుతం వరుణ్ తేజ్ చేసినవి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో..సాయి పల్లవి లాంటి న్యాచురల్ బ్యూటీ ని అభిమానించని వారు ఎవరు ఉంటారు అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.