ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే యానిమల్ సినిమాకి సంబంధించిన వార్తలే వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా యానిమల్ సినిమాలో రన్బీర్ కపూర్ రష్మిక మందన్నా బోల్డ్ పెర్ఫార్మెన్స్ చూసి జనాలు షాక్ అయిపోతున్నారు . కాగా రీసెంట్గా ఆర్జీవి సైతం తనదైనా స్టైల్ లో బోల్డ్ రివ్యూ ఇచ్చాడు . యానిమల్ సినిమా గురించి ట్వీట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు .
ఈ సినిమా చూసిన తర్వాత ఆర్జీవికి మైండ్ బ్లాక్ అయిందట . అంతేకాదు ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఆయనను ఎంతో మార్చేశాయట . మరి ముఖ్యంగా రణబీర్ కపూర్ నటన హైలెట్ గా ఉంది అంటూ పొగిడేసారు . ఈ సినిమాలో ఓ సీన్లో అమ్మాయి ని తన బూటు ను నాకమని చెప్తాడు రన్బీర్ . అయితే ఆ సీన్ తనకు నచ్చలేదట . కానీ ఆయన పర్ ఫామెన్స్ మాత్రం బాగుందట.
“రణ్బీర్ కపూర్ ఆ అమ్మాయిని షూ నాకమని చెప్పించిన ఆ ఒక్క షాట్ నాకు నచ్చకపోయినా , అనిల్ లాస్ట్ డైలాగ్ నుంచి జంప్ కట్ తీసుకుని ఎండ్ టైటిల్స్ కి వెళ్ళినప్పుడు కెమెరా జూమ్ అవుట్ షాట్ లో శక్తి కపూర్ ఒళ్ళో చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న రన్బీర్ షాట్ ఒక్కదాని కోసం, నేను మీ ఇద్దరి షూస్ నాకుతాను అని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు వర్మ. దీంతో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!
“యానిమల్ ” సినిమా గురించి నా రివ్యూ
– రామ్ గోపాల్ వర్మ https://t.co/QlP7onjEQY
— Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2023