ప్రభాస్ .. సలార్ సినిమా ఏ ముహూర్తం రిలీజ్ అయిందో కానీ అప్పటినుంచి సోషల్ మీడియా.. వెబ్ మీడియా ..టాలీవుడ్.. బాలీవుడ్ ..కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఇదే పేరు మారుమ్రోగిపోతుంది. సలార్ సినిమాకి సంబంధించిన నటీనటుల డీటెయిల్స్ .. సలార్ సినిమాకి సంబంధించిన రెమ్యూనరేషన్ డీటెయిల్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాగా సలార్ సినిమా విషయంలో కొందరు నెగిటివ్ గా కూడా కామెంట్ చేస్తున్నారు. అసలు సినిమా హిట్ అవ్వడానికి కారణం ప్రశాంత్ నీల్ అని..
ప్రభాస్ కాకపోతే ఆస్థానంలో వేరే ఎవడున్నా కూడా హిట్ కొట్టేవాడు అని కూసింత ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ బోల్డ్ గా ఆన్సర్ ఇస్తున్నారు. దమ్మున్న ఎవడైనా సరే ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి . ఈ సీన్ ఏ హీరో అయినా నటించగలడా ..? పాన్ ఇండియా స్టేటస్ వచ్చాక ఎవ్వడు కూడా ఇలాంటి సీన్స్ లో నటించలేదు . ఒక్క మా ప్రభాస్ అన్న తప్పిస్తే అంటూ ట్రెండ్ చేస్తున్నారు .
ప్రభాస్ అభిమానులు చెప్పిన మాట నిజమే . పాన్ ఇండియా స్టార్స్ మల్టీ స్టారర్ సినిమాలు చేయాలంటే ఆలోచిస్తారు. ఎక్కడ తమ స్టార్ స్టేటస్ దెబ్బతింటుందో అన్న భయం. ఒక సీను కాకపోయినా ఒక సీన్ ఒక హీరోకి హైలైట్ అవుతూ రాస్తారు డైరెక్టర్ లు.. ఆ మూమెంట్లో మరో హీరో ఇబ్బంది పడాల్సిందే ..సలార్ విషయంలో కూడా అదే జరిగింది . కానీ ప్రభాస్ కన్న పృథ్వీరాజ్ సీన్స్ హైలెట్ అయినా సరే ప్రభాస్ ఏమాత్రం బాధపడలేదు . అంతేకాదు ఈ సీన్ లో ప్రభాస్ చాలా జెన్యూన్ గా నటించాడు . ఆయన తన ఓడిలో అలా ఆ హీరో ని పడుకోబెట్టుకోవడం చాలా బాగుంది. అందుకే సినిమా ఇంత హిట్ అయింది అంటున్నారు అభిమానులు..!