ఉదయాన్నే బెల్లం టీ తాగితే ఎన్ని లాభాలో..?

చాలా మంది ఈ చలికాలంలో ఎక్కువగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే ఉదయం లేవగానే కాఫీ ,టీ వంటివి ఎక్కువగా తాగుతూ ఉంటారు. చలికాలంలో కొన్ని ఆహార పదార్థాలను మీ డైట్ లో ఉంచుకోవడం వల్ల చాలా మంచిదని తెలుపుతున్నారు.ఎందుకంటే ఇవి మన శరీరానికి వెచ్చదనాన్ని సైతం కలిగిస్తాయి. అలాంటి వాటిలో బెల్లం టీ కూడా ఒకటి. ఈ బెల్లం టి వల్ల ఉపయోగాలను ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

బెల్లం టి జీర్ణ క్రియ కు చాలా ప్రయోజకరణంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి జీర్ణక్రియకు సంబంధించి సమస్యలు ఉంటే ప్రతిరోజు ఉదయం లేవగానే బెల్లం టీని తాగితే మంచిదట.

బరువు తగ్గాలనుకునేవారు ఎన్నో రకాలుగా ట్రై చేసిన ఉపయోగం ఉండదు.. బెల్లం టీ ని ప్రతిరోజు ఉదయం తాగితే జీర్ణ క్రియ పెరిగి సులువుగా బరువు తగ్గుతారట.

బెల్లం టి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇది మహిళల పీరియడ్స్ సమస్యలను సైతం తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.వారికి వచ్చే కడుపునొప్పి తిమ్మిరి సమస్యలను కూడా దూరం చేస్తుందట.

బెల్లం టి రెగ్యులర్గా తాగితే ఊపిరితిత్తులు పేగులు పొట్ట చాల శుభ్రం అవుతాయట. దీంతో మలబద్ధక సమస్యను కూడా నివారిస్తుంది.

బెల్లం దీని ఎలా తయారు చేసుకోవాలి అంటే.. ముందుగా నీటిలోకి కాస్త అల్లం పచ్చి యాలకులు బెల్లం వేసి తక్కువ మంటలు వీటిని వడగట్టడం మంచిది. ఆ తర్వాత కొద్దిసేపు స్పూన్ తో తిప్పుతూ ఉండడం వల్ల పగిలిపోకుండా ఉంటుంది. ఒక నిమిషం తర్వాత గ్యాస్ ఆఫ్ చేస్తే సరిపోతుంది.