మా ఊరి పొలిమేర-2 చిత్రానికి ఊహించని టాక్..!!

గతంలో కంటే ఈ మధ్యకాలంలో తెలుగు సినీ పరిశ్రమలో విచిత్రమైన కాన్సెప్ట్లతో సినిమాలను తీస్తున్నారు. అలా ఈమధ్య వచ్చిన విభిన్నమైన బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రం మా ఊరి పొలిమేర ఈ సినిమా కరోనా సమయంలో ఓటిటిలోనే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమా సీక్వెల్ పైన అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ రోజున మా ఊరి పొలిమేర-2 చిత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది.

సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమాని మా ఊరి పొలిమేర డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శ్రీను తదితరులు సైతం నటించారు. గతంలో ఓటీటి లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న పొలిమేర చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. ఒక వ్యక్తి తన ప్రియురాలు తో కలిసి చనిపోయినట్టు నమ్మించి ఆమెను తీసుకువెళ్లి వేరే ప్రాంతంలో ఉండి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే కదా అంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు.

ఈ సినిమా చూసిన చాలామంది నెటిజన్స్ మా ఊరి పొలిమేర-2 నువ్వు ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో అద్భుతమైన విజయాన్ని అందిస్తుంది. చాలా కథలు నడిచాయి కానీ ఈ సినిమా విభిన్నంగా ఉందంటూ ఫైరింగ్ గా ఉందంటూ రాసుకురావడం జరిగింది.

సత్యం రాజేష్ ఈ సినిమాలో మరొకసారి అద్భుతమైన నటనను ప్రదర్శించారని మొదటి భాగం బాగుందని బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని మొదటి భాగానికి మించి రెండో భాగంలో సన్నివేశాలు హైలెట్గా ఉన్నాయని ఎక్కడ బోర్ కొట్టలేదని తెలుపుతున్నారు. త్వరలోనే థర్డ్ పార్ట్ కూడా మొదలు కాబోతోందని తెలియజేయడం జరిగింది.

మా ఊరి పొలిమేర-2 సినిమా చూసిన నెటిజన్స్ ఇందులో కొన్ని ట్విస్టులు ఉన్నాయని క్లైమాక్స్ కూడా అదిరిపోయిందని ఖచ్చితంగా ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూడాలని ట్విట్టర్ రూపంలో తెలుపుతున్నారు.