వరుణ్ – లావణ్య పెళ్లిలో బాబాయ్ – అబ్బాయిల చిలిపి కొట్టుడు…!

ఇటీవల మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో మెగా హీరోలు అంతా సందడి చేశారు. నాలుగు రోజుల డెస్టినేషన్ వెడ్డింగ్ నుంచి ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ పెళ్లి నుంచి బాబాయ్ – అబ్బాయి రేర్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ – రామ్ చరణ్ ఇద్దరూ పెళ్ళిలో సరదాగా మాట్లాడుకుంటూ జాలీగా కనిపించారు. ఇలా వీరిద్దరూ కలిసి నవ్వుకుంటూ మాట్లాడుకునే ఫిక్స్ చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటాయి.

మెగా అభిమానులు ప్రస్తుతం ఇది వైరల్ చేస్తూ నెట్టింట సందడి చేస్తున్నారు. అయితే ఈ ఫోటో జోర్దార్‌గా సందడి చేస్తు, జబర్దస్త్ గా రెడీ అవ్వాలి, మేకప్ అవ్వాలి అని భావించే చాలా మందికి కనువిప్పు. అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడ పెళ్లి కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ కాలేదు. చాలా సింపుల్ గా క్యాజువల్ లుక్ లో పెళ్లి మొత్తం సందడి చేశాడు. పైగా అతను ఒకే తరహా టీషర్ట్, ఫ్యాంట్ తో పెళ్లి మొత్తం కనిపించాడు. ఇక ఇటీవల రిలీజైన ఓ ఫోటోగ్రాఫ్ లో అదనంగా ఒక నల్ల కోట్టు మాత్రమే ధరించాడు. అది కూడా అక్కడ చలిని తట్టుకోవడానికి మాత్రమే అనేట్టు కనిపించింది.

ఇక రామ్‌చరణ్ కూడా బాబాయికి తగ్గట్టే చాలా సింపుల్ గా కనిపించాడు. వైట్ అండ్ వైట్‌లో పెళ్లి వైబ్‌ తెచ్చాడు. కానీ సింప్లిసిటీని మాత్రం వదలలేదు. పవన్ – చరణ్ అలా జాలిగా నవ్వుకుంటూ చిలిపి అల్ల‌ర్ల‌తో పెళ్లి తంతును ఆస్వాదించడం అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. ఈ పెళ్లిలో ఇద్దరు సూపర్ స్టార్లు చాలా సాధారణంగా కనిపించి మెగా అభిమానులలో హైలెట్ అయ్యారు. మిగతా వారంతా సందర్భానుసారం వెరైటీ దుస్తులను ధ‌రించి సందడి చేయగా.. ఈ ఇద్దరు రొటీన్ గానే సహజంగా కనిపించారు.

 

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇద్దరు పాన్ ఇండియా లెవెల్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఎస్.ఎస్ రాజమౌళి ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ ఎస్ శంకర్ డైరెక్షన్లో గేమ్‌చేంజ‌ర్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ దీపావళికి రిలీజ్ కానుంది. పవన్ సుజిత్ దర్శకత్వంలో ఓజి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో ఓ వైల్డ్ గ్యాంగ్ స్టార్ పాత్రను పోషించాడు. హరిహర వీరమల్లు, ఉస్తాద్‌ భగత్ సింగ్ లాంటి భారీ సినిమాల్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు.