శ్రీలీల‌ను చూసి ఆ స్టార్ హీరోయిన్లు ఏం చేస్తున్నారో చూడండి..!

పెళ్ళిసందడి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా శ్రీ లీలా మారిపోయింది. మొదటి సినిమా నిరాశపరిచిన కూడా లక్కీగా రవితేజ తో ధమాకా ఆఫర్ వచ్చింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆమె రేంజ్ వేరే లెవెల్‌కి వెళ్ళింది. నటనతో పాటు డాన్స్ లోను ప్రేక్షకులను మెప్పించిన శ్రీ‌లీల అటు మాస్‌, ఇటు క్లాస్ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో వరుసగా పది సినిమాలకు పైగా ఉన్నాయి. ఇటీవల స్కంద, భగవంత్ కేసరి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ నెలలో మెగా హీరో వైష్ణవ తేజ్ – శ్రీ లీల జంటగా నటించిన ఆదికేశవ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమాలో శ్రీ లీల మాస్ లుక్ లో సూపర్ డాన్సులతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతుంది. డిసెంబర్‌లో శ్రీ లీల ఎక్స‌ట్రార్డినరీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరిలో ప్రేక్షకులు ముందుకి రాబోతున్న సంగతి తెలిసిందే. ఇలా వరుసగా నెలకు ఓ సినిమాను రిలీజ్ చేస్తున్న శ్రీ లీల.. ఫ్యూచర్లో నెలకు రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలతో పాటు, శ్రీ లీల ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే శ్రీ లీల ఈ రేంజ్‌లో దూసుకుపోవడంతో తోటి స్టార్ హీరోయిన్స్ ఐన రష్మిక మందన, పూజ హెగ్డే తదితరులు కూడా ఆమెను చూసి కుళ్ళు కుంటున్నారు అనే అభిప్రాయాం వ్య‌క్తం చేస్తున్నారు నెట్టిజన్లు. ఇక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ఈ రేంజ్‌లో క్రేజ్‌ను సంపాదించడం సాధారణ విషయం కాదు అని తన‌ తోటి స్టార్ హీరోయిన్స్ షాక్ అవుతున్నారట.