అన్ని గంటల రన్ టైమ్ తో షాకిస్తున్న యానిమల్ మూవీ.. ప్రేక్షకుల థియేటర్లో ఉంచగలరా..?

అర్జున్ రెడ్డి సినిమాతో అటు టాలీవుడ్ బాలీవుడ్ ప్రేక్షకులకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. ఈయన దర్శకత్వంలోనే తాజాగా వస్తున్న చిత్రం యానిమల్ ఇందులో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటిస్తూ ఉండగా హీరోయిన్గా రష్మిక నటిస్తోంది. ఇప్పటికి ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం జరిగింది. డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రనికి సంబంధించి ఒక విషయం వైరల్ గా మారుతోంది.

అదేమిటంటే ఈ సినిమా రన్ టైం ఏకంగా 3 గంటల 21 నిమిషాలు ఉన్నట్లు సమాచారం.. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఇటీవల కాలంలో ఇంత పెద్ద నిడివి ఉన్న సినిమాలు ఏవి బాలీవుడ్ లో విడుదల కాలేదు.. 2016లో వచ్చిన ధోని సినిమా 3:10 నిమిషాలు.. ఇదే అంత పెద్ద సినిమా హిందీలో విడుదల కావడం జరిగింది. అయితే ఇంత పెద్ద లెంతి టైం సినిమా ఆడియన్స్ ను థియేటర్లో ఉంచడం అంటే చాలా కష్టంతో కూడిన పని.

ఈ సినిమా టెర్రపిక్ గా ఉందని ఒక్క నిమిషం కూడా ఎక్కడ బోర్ కొట్టదని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే అంత రన్ టైం చిత్ర బృందం ఫిక్స్ చేసినట్లుగా సమాచారం. అయితే ఈ సినిమాతో మల్టీప్లెక్స్ లకు మాత్రం చాలా దెబ్బ పడే అవకాశం ఉన్నది.. పెద్ద సినిమాలకు 6 షోలు అవకాశం ఉంటుంది.. కానీ ఇంత లాంగ్ టైం లో 5షోలు మాత్రమే వేసుకొని అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా టైమింగ్ లో కూడా మార్పు ఉంటుంది అయితే ఈ రన్ టైం పైన మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది.