ఇంట్లోనే సులభంగా కొత్తిమీరను పెంచాలనుకుంటున్నారా… అయితే ఈ టిప్స్ మీకోసమే..!!

ధనియా గా ప్రసిద్ధి చెందిన కొత్తిమీర మన వంటకాలలో ఒక ముఖ్యమైన పదార్థం. అంతేకాకుండా, హెర్బ్ అనే ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరు కొత్తిమీర మొక్కను పెంచాలనుకుంటారు. కానీ ఎలా పెంచాలో తెలియకపోవచ్చు. ఇప్పుడు మనం కొత్తిమీర మొక్కను ఎలా పెంచాలో తెలుసుకుందాం.

కొత్తిమీర విత్తనాలు లేదా మొలకలను తీసుకోవాలి. అలాగే తగిన కంటైనర్ను ఎంచుకోండి. మీరు కొత్తిమీర గింజలను కంటైనర్ లో లేదా నేరుగా నేలపై సులభంగా నాటవచ్చు. మొక్క ఎలాగైనా బాగా పెరుగుతుంది – మీరు అందుకు కుండలో మంచి పోషకాలు ఉండేలా చూసుకోండి.

మట్టి ఎక్కువగా పుష్కలంగా ఉన్నచోట.. మట్టిని మొత్తం తవ్వి.. ఆ మట్టిని పైపైన జిమ్ముతూ విత్తనాలను కూడా అలానే జుమ్ముతూ వెయ్యాలి. తగినంత సూర్యకాంతి అందేలా చూసుకోవాలి. కనీసం రోజు 4,6 గంటల సూర్యకాంతి పడేలా చూసుకోవాలి. మొక్కకు తరచూ నీళ్ళు పోస్తూ.. కూరగాయలు కట్ చేసిన తొక్కలను వేస్తూ ఉండాలి. ఇలా తరచూ చేస్తుంటే వారం రోజుల్లో మీ మొక్క పెరుగుతుంది.