తెలుగు బుల్లితెరపై యాంకర్ రష్మీకి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉన్నది. ప్రస్తుతం వెండితెర బుల్లితెర అని తేడా లేకుండా సక్సెస్ఫుల్గా కెరియర్ ని ముందుకు తీసుకువెళ్తోంది రష్మీ. గతంలో ఎలాంటి చిత్రాలలోనైనా ఎలాంటి పాత్రలోనైనా నటించిన రష్మీ ఈమధ్య తనకు సెలెక్టెడ్ కథలని ఎంచుకుంటూ ముందుకు వెళ్తోంది. అయితే రష్మీ పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. కేవలం తన ఫోకస్ మొత్తం బుల్లితెర పైన పలుషోలు ఈవెంట్లలోనే సమయాన్ని గడిపేస్తోంది.
రష్మీ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇతరత్రా పండుగలు ఈవెంట్లకు కూడా యాంకర్ గా చేస్తూ ఉంటుంది.. గతంలో సుధీర్ -రష్మి లవ్ ట్రాక్ గురించి బాగా వార్తలు వినిపించాయి. ఈ వార్తల వల్లే వీరిద్దరూ మంచి పాపులారిటీ అందుకున్నారు. సుధీర్ తెర పైన హీరో అంటూ ప్రస్తుతం బిజీగా ఉండగా రష్మీ మాత్రం బుల్లితెర పైనే ఒక వెలుగు వెలుగుతోంది. ఈ జంట అభిమానులు మాత్రం వీరిద్దరిని కలిపి ఒక సినిమా చేయాలని కోరుకుంటూ ఉంటారు.
బుల్లితెర పైన ఎన్నోసార్లు జంట గా కనిపించిన వీరు అభిమానులను అలరిస్తూనే ఉంటారు. ఇప్పుడు తాజాగా రష్మి వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అండమాన్ దీవులలో తన అందాల ఆరబోతతో ఫుల్ ఎంజాయ్ మోడ్ లో కనిపిస్తోంది రష్మీ. తన ఫ్రెండ్స్ తో కలిసి అండమాన్ దీవులలో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు వీడియోలు సైతం వైరల్ గా మారుతున్నాయి. అక్కడ బీచ్ దగ్గర రెచ్చిపోయి మరి ఉన్నట్టుగా కనిపిస్తోంది.
View this post on Instagram