స్టార్ హీరోలు కూడా చేయలేని పనిని చేస్తున్న కిరణ్ అబ్బవరం.. ఫ్యాన్స్ ఫిదా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరోలలో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు. మొదట రాజావారు రాణి గారు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మంచి పాపులారిటీ అందుకున్నారు. ఆ వెంటనే Sr. కళ్యాణ మండపం సినిమాతో మరింత క్రేజీ సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఇటీవలే వచ్చిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్లుగా మిగిలాయి, వరుస ఫెయిల్యూర్ ఎఫెక్ట్ తన కెరియర్ పైన గట్టిగానే పడింది.

ఈ పరాజయాల పైన కూడా పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. అయితే తను నటించిన చాలా చిత్రాలకు రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలిపారు. కేవలం లాభాలలో మాత్రమే వాట పద్ధతిలో తాను సినిమాలు చేస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. సెబాస్టియన్ pc -524 నుంచి ఈ రూట్ ని ఎక్కువగా ఫాలో అవుతున్నట్లు తెలియజేశారు. ఒకవేళ ప్రొడ్యూసర్లు నష్టపోతే వారి నుంచి ఎలాంటి రెమ్యూనరేషన్ కూడా తీసుకోనని తెలిపారు. అయితే తాను నటించిన మీటర్ నేను మీకు బాగా కావలసిన వాడిని వంటి చిత్రాలు రిజల్ట్ సైతం తాను ముందుగానే ఊహించానని తెలియజేశారు.

తన ఇమేజ్కు మించి ఊహించని ఎలివేషన్స్ వల్ల ఈ సినిమాలు ఫ్లాపులు అయ్యాయని తెలిపారు. గత సినిమాలు ఫలితాల నుంచి ఎన్నో గుణపాటాలు నేర్చుకున్నారని తెలియజేశారు. కథలు వాటి ఎగ్జిక్యూషన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారని తొందరపడి ఎలాంటి సినిమాలు చేయకూడదని.. అందుకే తన కెరీర్ కి ఆరు నెలల పాటు బ్రేక్ ఇచ్చానని తెలిపారు. అయితే కిరణ్ అబ్బవరం తన సినిమాలకు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించడం అనేది చాలా అరుదైన విషయం ఎందుకంటే స్టార్ హీరోలు యంగ్ హీరోలు సైతం ఇలాంటివి చేయడం చాలా అరుదు గానే ఉంటుంది.