యంగ్ హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరోయిన్ శ్రీ లీల కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం స్కంద. ఈ సినిమా మొదటి రోజు నుంచి నెగిటివ్ టాక్ తో ఉన్నది. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల అయ్యి 90 కోట్లతో తీస్తే బాక్సాఫీస్ వద్ద 60 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది. దీంతో రామ్ అభిమానుల సైతం మరొక చెత్త సినిమా తీశారని కామెంట్స్ చేస్తున్నారు. స్కంద సినిమా పైన చాలా దారుణమైన ట్రోల్స్ కూడా గత కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి.
అయితే ఈ సినిమాకి బోయపాటి శ్రీను కథ స్క్రీన్ ప్లే అన్ని అందించడంతో విఫలమయ్యారని చెప్పవచ్చు. తాజాగా ఓటీటి లో ఈ సినిమా విడుదలైన ప్రజాదారణ బాగానే పొందినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో చాలా సన్నివేశాలు లాజిక్నెస్ గా ఉన్నాయని సోషల్ మీడియాలో చాలా దారుణంగా ట్రోల్ కి గురవుతోంది. అంతేకాకుండా పలు రకాల సీన్స్ వీడియో క్లిప్పులు కూడా వైరల్ గా మారుతున్నాయి. బోయపాటి ఓవరాక్షన్ అంటూ ఏకిపారేస్తున్నారు నేటిజన్స్.
అయితే ఈ సినిమాలో రామ్ పాత్ర కొంతమంది గుండాలను హారతితో పొడిచే సన్నివేశం చాలా వేగంగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అయితే స్లో మోషన్ లో ఈ సన్నివేశం చూసినప్పుడు అది ఎడిటింగ్ మిస్టేక్ గా నేటిజన్స్ గుర్తిస్తున్నారు. ఈ సన్నివేశంలో రామ్ బాడీ డబుల్ గా స్వయంగా బోయపాటి శ్రీను నటించారట. అయితే ఇలాంటి సన్నివేశాలలో హీరోలాగా కనిపించే మరో వ్యక్తిని ఎంచుకుంటారు. కానీ బోయపాటి శ్రీను ఎవరికి అవకాశం ఇవ్వకుండ తానే డబుల్ గా నటించే బాధ్యతను తీసుకున్నట్లు సమాచారం.. కానీ పూర్ ఎడిటింగ్ కారణంగా ఒక షాట్ లో స్వయంగా కనిపిస్తారు. దీంతో బోయపాటి శ్రీను దర్శకత్వం నవ్వుల పాలవుతోంది.