బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ షో అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు.. బుల్లితెర పైన రికార్డు స్థాయిలో టిఆర్పి రేటు సాధిస్తున్న కామెడీ షో గా పేరు పొందింది. మొదటినుంచి ఇప్పటివరకు బుల్లితెర పైన సత్తా చాటుతున్న ఈ కామెడీ షోలో ఎంతోమంది కమెడియన్స్ సైతం తమ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ప్రేక్షకులలో సంపాదించుకున్నారు. ఇప్పుడు చాలామంది జబర్దస్త్ కమెడియన్స్ వెండితెర పైన రాణిస్తూ ఉన్నారు. కొంతమంది హీరోలుగా మరి కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీగా ఉన్నారు.
జబర్దస్త్ లో మొదట యాంకర్ గా అనసూయ ఉన్నప్పటికీ ఆ తర్వాత ఆమె వెళ్లిపోవడంతో రశ్మిని తీసుకురావడం జరిగింది. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకి జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ రెండు షోలుగా విడదీయడం జరిగింది. ఇందులో జబర్దస్త్ షో కి అనసూయ యాంకర్ ఉండగా.. ఎక్స్ ట్రా జబర్దస్త్ కి రష్మీ ఉన్నది. మొదట జడ్జిలుగా రోజు నాగబాబు ఉండగా కొన్ని కారణాల చేత వీరిద్దరు తప్పుకోవడంతో ఒకసారిగా టిఆర్పి రేటింగ్ పడిపోయింది. వారి స్థానంలో చాలామంది జడ్జ్లను తీసుకురావడం జరిగింది.
ఇక యాంకర్ గా అనసూయ కూడా తప్పుకోవడంతో ఆమె స్థానంలో సౌమ్యరావును తీసుకువచ్చారు.. రష్మీ సౌమ్యరావు ఇద్దరు కూడా యాంకరింగ్ గా తన అందచందాలతో ఎంటర్టైన్మెంట్ చేశారు.. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి తాజా ప్రోమోలో ఒక కొత్త యాంకర్ ను తీసుకురావడం జరిగింది. ఆమె ఎవరో కాదు సౌమ్య స్థానంలో వచ్చిన కొత్త యాంకర్ సిరి హనుమంత్. యూట్యూబ్లో మొదట షార్ట్ ఫిలిమ్స్ లతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె సీరియల్స్ లో కూడా కీలకమైన పాత్రలలో నటించింది. బిగ్బాస్ సీజన్-5 లో కూడా అడుగు పెట్టింది. ఇటీవల షారుఖ్ జవాన్ సినిమాలో కూడా నటించింది. తాజాగా యాంకర్ సౌమ్యరావుని ఎందుకు తీసేసారో తెలియదు కానీ ప్రస్తుతం సిరి హనుమంతు ఎంట్రీ ఇవ్వబోతోంది..