ఫాన్స్ ను కలవరపెడుతున్న విష్ణు ప్రియా పోస్ట్.. .అసలేం జరిగుంటుంది?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమున్న పేరు విష్ణు ప్రియా. బుల్లితెర పై యాంకర్ గా మంచి గుర్తింపు సాధించిన వ్యక్తులలో ఈమె కూడా ఒకరు. పటాస్, పోవే పోరా వంటి టీవీ షోల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా విష్ణు ప్రియ, తక్కువ సమయం లోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. తన చలాకి తనంతో, అల్లరితో అందర్నీ ఆకర్షించింది. తన టాలెంట్ తో అభిమానులను ఎంటర్టైన్ చేస్తూనే, మరోవైపు తన అందాలతో కుర్రాళ్ళ మతి పోగొడుతుంది విష్ణు ప్రియ. బుల్లితెర పై ఆక్టివ్ ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకర్షిస్తుంది.

బుల్లితెర పై ప్రేక్షకులను అలరించే ఈ ముద్దుగుమ్మ, వెండితెర పై తన అందాలను ఆరబోయడానికి కూడా వెనుకాడదు. ఒకవైపు టీవీ షో లు చేస్తూనే, మరోవైపు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తుంది. గత ఏడాది ఈమె చేసిన “జరీ జరీ పంచ కట్టు” అనే పాట ఎంత మంచి ప్రేక్షకాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతే కాకుండా, దర్శకేంద్రుడు కే. రాఘవేందర్రావు పర్యవేక్షణలో “వాంటెడ్ పండుగాడు” అనే చిత్రంలో కూడా నటించింది. ఐతే ఈ చిత్రం అనుకున్న వియజయాన్ని సాధించలేదు. ఐతే ఎప్పుడు చలాకీగా, అల్లరి చేస్తూ ఉండే విష్ణు ప్రియా గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్లు పెడుతుంది. ఆ మధ్య తన స్నేహితులను ఉద్దేశిస్తూ విష్ణు ప్రియా పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. ఇప్పుడు మళ్ళి మరో పోస్ట్ తో ఫాన్స్ ను కలవరపెడుతోంది ఈ ముద్దుగుమ్మ.

“మెంటల్ హెల్త్ ఖరాబ్, కెరీర్ ఖరాబ్, రిలేషన్స్ ఖరాబ్, షెడ్యూల్స్ ఖరాబ్, ఐనా కూడా చిల్ అవుతున్నా” అంటూ ఒక వీడియొను షేర్ చేసింది. ఈ వీడియో చూసిన ఆమె అభిమానులు కంగారులో పడ్డారు. ఈ పోస్ట్ చూస్తే, ఆమె నటించిన చిత్రం అనుకున్న స్థాయి విజయాన్ని సాధించకపోవడం, ఇతర అవకాశాలు రాకపోవడం వలన కాస్త నిరాశ చెందినట్టు అనిపిస్తోంది.