ఆస్తులు అమ్మేసుకుంటున్న రాకింగ్ రాకేష్…కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఎందరో తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ కామెడీ షో కేవలం ప్రేక్షకులకు నవ్వులు పంచడం మాత్రమే కాకుండా, అందులో పాల్గొన్న ఎందరో కంటెస్టెంట్లకు సినీ రంగంలో మంచి అవకాశాలను కల్పించింది. వారి జీవితాలలో బంగారు బాటలు వేసింది. ఎందరో కంటెస్టెంట్ లు కామెడియన్లుగా సినిమా రంగంలో ప్రవేశించగా, మరికొందరు దర్శకులు, నిర్మాతలుగా కూడా మారారు. ఈ మధ్య ఒక జబర్దస్త్ కంటెస్టెంట్ వేణు “బలగం” చిత్రానికి దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నాడు మరో కమెడియన్. అతనే రాకింగ్ రాకేష్.

ఒక సాధారణ కంటెస్టెంట్ గా జబర్దస్త్ లో అడుగుపెట్టి, తన టాలెంట్ తో, కష్టం తో, టీం లీడర్ గా ఎదిగిన రాకింగ్ రాకేష్ ఇప్పుడు ఒక సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. దర్శకత్వంతో పాటు నిర్మాణం బాధ్యతలు కూడా అతనే తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమా పేరు “కే సి ఆర్”. “కే సి ఆర్” అంటే తెలంగాణ ముఖ్యమంత్రి బయోపిక్ అనుకుంటారేమో. కాదండి…..కే సి ఆర్ అంటే “కేశవ చంద్ర రమావత్”. ఈ చిత్రం తెలంగాణ ప్రాంతంలో ఉండే బంజారాల నేపథ్యంలో ఉంటుంది. తాజాగా తెలంగాణ మంత్రి మల్లా రెడ్డి గారి చేతులమీదిగా ఈ చిత్రం ఆవిష్కరణ కూడా జరిగింది. ఈ ఈవెంట్ లో రాకేష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు.

తాను తెలంగాణ ముఖ్యమంత్రి “కే సి ఆర్” గారికి పెద్ద ఫ్యాన్ అని, అందుకే తన సినిమాకు ఆయన పేరు పెట్టుకున్నానని చెప్పుకొచ్చాడు రాకేష్. తాను ఈ చిత్రాన్ని బినామీ డబ్బులతో నిర్మిస్తున్నాడని వస్తున్న వార్తలను కొట్టిపడేసాడు రాకేష్. ఈ చిత్రం విషయంలో చాలా మంది సహాయం చేస్తాం అని చెప్పి మోసం చేసారని, ఒక రచయత కూడా హ్యాండ్ ఇచ్చాడని అన్నాడు రాకేష్. ఈ చిత్రం నిర్మించడానికి తాను ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటిని కూడా తాకట్టు పెట్టేసాడట రాకేష్. తన కార్ కూడా అమ్మేసాడట. ఐతే ఈ ప్రయాణంలో తనకు తన కుటుంబం అండగా నిలిచిందని చెప్పుకొచ్చాడు రాకేష్.