ఒకే కుటుంబం నుంచి హీరోలు గా ఎంట్రీ ఇస్తే.. ఇతర కుటుంబ హీరోలతో అభిమానులు ఎక్కువగా గొడవపడిన సందర్భాలు ఉంటాయి.. కానీ వాళ్లలో వాళ్లు గొడవపడే సందర్భం చాలా తక్కువగానే ఉంటుంది. అప్పట్లో ఎక్కువగా మెగా ఫ్యామిలీలో ఇలాంటి గొడవలే తలెత్తేవి.. ముఖ్యంగా అల్లు అర్జున్, చిరంజీవి వర్గాల మధ్య ఏదో ఒక గొడవ వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పటికీ కూడా అక్కడక్కడ ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటాయి. కానీ మెగా హీరోలో అంత మాత్రం మేమంతా ఒక్కటే అంటూ తెలియజేస్తూ ఉంటారు.
ఇదంతా ఇలా ఉంటేగా ఇప్పుడు నందమూరి కుటుంబంలోని హీరోల మధ్య అభిమానుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఎన్టీఆర్ ,బాలకృష్ణ అభిమానుల మధ్య ఎప్పటినుంచో ఒక వారు వినిపిస్తోంది. ఇప్పుడు తాజాగా బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాను చూడొద్దంటూ పలువురు అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం జరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ అభిమానులు అదే రేంజ్ లో కౌంటర్లు వేస్తూ ఉన్నారు.. ఆంధ్రప్రదేశ్లో ఒక థియేటర్ దగ్గర బాలయ్య బ్యానర్ మీద జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఉందని అభిమానులు కోపంతో చాలా ఊగిపోయారు.
మా హీరో బ్యానర్ మీద ఆయన ఫోటో ఎందుకు ఉండాలంటూ కాళ్ళ కింద వేసుకుని తొక్కేశారు.. ఈ విజిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ను బాలకృష్ణ పక్కన చూడడానికి అభిమానులు అసలు ఒప్పుకోలేదు. ఇదే స్థాయిలో ఎన్టీఆర్ అభిమానులు కూడా బాలయ్య విషయంలో వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ రానప్పుడే తెలుగుదేశం కార్యకర్తలు ఎన్టీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు.. దీన్నిబట్టి చూస్తే ఎన్టీఆర్ బాలయ్య ఫ్యాన్స్ మధ్య వివాదాలు మరొకసారి తారస్థాయికి చేరుతున్నాయి.