50 రోజులకు జవాన్ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందంటే..?

ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఏ సినిమా అయినా నెల రోజులు ఆడాలంటే చాలా గగనమని చెప్పవచ్చు. మహా అయితే 15 రోజులు లేకపోతే 20 రోజులకే సినిమాల హవా తగ్గిపోతుంది. దాదాపుగా వంద రోజులు పూర్తి చేసుకోవాలి అంటే చాలా రేర్ అని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా అర్థశతదినోత్సవం పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి హడావిడి లేకుండా వచ్చిన జవాన్ సినిమాకి డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించారు.

ఇందులో షారుక్ ఖాన్ కి జంటగా నయనతార నటించిన విజయసేతుపతి విలన్ గా నటించారు అలాగే దీపికా పదుకొనే క్యామియో పాత్రలో అద్భుతంగా నటించింది. అలాగే సంజయ్ దత్ కూడా కీలకమైన పాత్రలో నటించడం జరిగింది. ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన విడుదలై నేటితో 50 రోజులు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కూడా జవాన్ సినిమా అత్యధిక కలెక్షన్లు కాబట్టి అభిమానులను ఫుల్ ఖుషి చేస్తోంది. 50వ రోజుల్లో కూడా 11 లక్షల రూపాయల కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది.

ఇక 50 రోజుల గాను దాదాపుగా 1145 కోట్ల రూపాయల వరకు క్రాస్ వసూలు చేసిందని రెండు అర్థాలు తెలియజేస్తున్నాయి. 50 రోజులు పూర్తి చేసుకోవడంతో డైరెక్టర్ అట్లీ ఒక పోస్టర్ని రిలీజ్ చేస్తూ 50 రోజులు గడిచిన ఇప్పటికి మిలియన్ల మంది హృదయాలను గెలుచుకున్న జవాన్ సినిమా ప్రపంచంలోనే ప్రతి మూలను శాసిస్తోంది అంటూ రాసుకోచ్చారు. ప్రస్తుతం జవాన్ సినిమాకి సంబంధించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది .దాదాపుగా చాలా రోజుల తర్వాత బాలీవుడ్ లో 50 రోజులు ఆడిన సినిమాగా పేరుపొందింది.