ఆ రోజు భయపడి నాగార్జున ఇంట్లో దాక్కున్న రామ్ చరణ్..ఎందుకంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి – నాగార్జున ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే చనువుతో మొదటి నుంచి రాంచరణ్ కూడా నాగార్జునని అంకుల్ అంకుల్ అంటూ ప్రేమగా పిలిచేవారు . కాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ రోజు భయపడి పోయి తన తండ్రికి తన ఇంట్లో వాళ్లకి తెలియకుండా నాగార్జున ఇంట్లో తలదాచుకున్నాడట . అంతేకాదు బోరున ఏడ్చేసాడట . ఇదే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెరంగేట్రం చేసిన సినిమా చిరుత . పూరి జగన్నాధ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా షూట్ అంతా కంప్లీట్ అయిపోయాక రిలీజ్ కి ముందు రోజు నాగార్జున ఇంటికి వెళ్లి బోరున ఏడ్చేసాడట రామ్ చరణ్. ” నాకు భయంగా ఉంది నేను హీరోని అవుతానా..? అవ్వలేనా..? అంటూ టెన్షన్లో గుక్క పట్టి ఏడ్చేసాడట”.

దీంతో సముదాయించిన నాగార్జున “నీ సినిమా ప్రీవ్యూ చూశాను చాలా బాగుంది ..పెద్ద హీరోవి అవుతావు.. డోంట్ వర్రీ.. కూల్ ..రిలాక్స్ అంటూ నచ్చజెప్పి పడుకోపెట్టాడట “. మార్నింగ్ లేచే సరికి అన్ని పాజిటివ్ రివ్యూస్ చూడగానే రామ్ చరణ్ ఫుల్ హ్యాపీగా ఫీలైపోయారట. అలా మొదటి సినిమా ఎక్స్పీరియన్స్ ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు రామ్ చరణ్..!!