డిజాస్టర్ దిశగా స్కంద సినిమా.. ఎన్ని కోట్లు నష్టం అంటే..?

డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరో రామ్ నటించిన తాజా చిత్రం స్కంద.. ఇందులో హీరోయిన్గా శ్రీలీల నటించింది. కీలకమైన పాత్రలో సాయిమంజ్రేకర్ నటించింది. సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అర్థం చేసుకుంది. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ సభ్యులను మరియు సానుభూతిపరులను ఆకర్షించాయి తప్ప బోయపాటి కావాలని ఇలా రాయించారని హీరో రామ్ కి ఏపీ గవర్నమెంట్ పైన ఉన్న కోపము తెలియదు కానీ ఇలా ఇండైరెక్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన మాట్లాడినట్లుగా తెలుస్తోంది.

Skanda' movie review: Boyapati Sreenu and Ram Pothineni's mass outing is a  test of endurance - The Hindu

భూమ్..భూమ్ బీర్ల పైన.. కానీ నిద్రపోతున్న వారిని చంపడం నీకు అలవాటేమో లేపి చంపడం నాకు అలవాటు.. ఇయ్యాలే పొయ్యాలి గట్టిగా అరిస్తే తోయాలి తదితర డైలాగులు సైతం అందరికీ విసుగు తెప్పించేలా ఉన్నాయి.. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ సీఎంల పైన పలు రకాల డైలాగులు చెప్పడంతో ఇవి వైరల్ గా మారుతున్నాయి. సిన్ తో సంబంధం లేకుండా డైలాగులు వచ్చి పోయాయని పలువురు నెటిజెన్లు వాపోతున్నారు. కేవలం టిడిపి కోసమే ఈ సినిమా తీశారు అన్నట్టుగా ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

కథ కథన పెద్దగా లేకపోవడంతో పాటు డైలాగులు కూడా మితిమీరిన విధంగా ఉండడంతో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. స్కంద సినిమా అయితే అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. రామ్ కెరియర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా మొదటి రోజు రూ.10.57 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రెండవ రోజు నుంచి కలెక్షన్స్ డ్రాప్ అయ్యింది. మొత్తంగా 47 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరగగా ఈ సినిమా భారీ నష్టాలని మూటకట్టబోతున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా కేవలం 26 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇంకా 22 కోట్లు రాబట్టాల్సి ఉండగా రాబోయే పరిస్థితులను చూస్తే రాబట్టడం కష్టమే అని చెప్పవచ్చు.