ఈసారి ఐసీసీ వరల్డ్ కప్ వేలకోట్ల ప్రకటనలతో దిమ్మతిరిగే ఆదాయం..

క్రికెట్ ప్రియలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ వరల్డ్ కప్ 2023 క్రికెట్‌ మ్యాచ్ మొదలవడానికి ఇంకా ఒకరోజు మాత్రమే మిగిలి ఉంది. ఒకపక్క మెగా టోర్నమెంట్.. మరో పక్క దసరా, దీపావళి పండుగలు. దీంతో అటు ఫ్యాన్స్ , ఇటు బిజినెస్ పర్సన్స్ ఇరువురిలోను మంచి ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ ఏడాది వన్డే ఇంటర్నేషనల్ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ప్రకటనలతో భారీ ఆదాయం తెచ్చుకోవచ్చని పరిశ్రమల వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక 2023 వరల్డ్ కప్ డిజిటల్ టర్నింగ్స్ పెరుగుతాయని మునుపటి ఎడిషన్ తో పోలిస్తే 70% ఎక్కువగా ఉండవచ్చని దాదాపు రెండువేల కోట్లకు పైగా ఆదాయాన్ని ఈ ప్రకటనలు తెస్తాయని అంచనా. 2019 ప్రపంచ కప్ లో ఖర్చు చేసిన దానికంటే ఈ క్రికెట్ కప్పుకు రెట్టింపు ఖర్చు పెట్టనున్నారన్న‌ అంచనాలు ఆసక్తి రేపుతున్నా. ముఖ్యంగా పండగ కాలంలో ప్రకటన ఖర్చులు 15 శాతం పెరుగుతాయని వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. 2022 తో పోలిస్తే ఈ సంవత్సరం పండగ కాలం కాబట్టి ప్రకటన ఖర్చు కనీసం 10 – 15 శాతం పెరుగుతుందని యాడ్ ఏజెన్సీ – వ్యవస్థాపకుడు ఎండి అంబికా శర్మ వివరించాడు.

రాబోయే క్రికెట్ ప్రపంచ కప్ చాలా మంది వ్యూవర్స్కు యాడ్ డిస్ట్రిబ్యూటర్స్ కు ఆకర్షణీయంగా మారబోతుందని చెప్పుకొచ్చాడు. ఏడాదికి మొత్తం యాడ్స్ ఖర్చులు 40 – 45 శాతం పండగ కాలంలోనే జరుగుతుందట. ఇక క్రికెట్‌కి రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణ, ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్ల దృష్ట్యా వస్తున్న వరల్డ్ కప్ ద్వారా టీవీ, డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో కలిపి రూ. 2000 – 2,200 కోట్ల ప్రకటనల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. 2019 క్రికెట్ వరల్డ్ కప్ డిజిటల్ అడ్వర్టైజింగ్ ఆదాయం రూ.400 – 500 కోట్ల లోపే. ఇక క్రికెట్‌కు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో భారీ క్రేజ్ ఏర్పడింది.

డిజిటల్ ఛానల్ లో తక్కువ ధరలు అనేక బ్రాండ్స్ ను ప్రమోట్ చేసుకునే అవకాశం వస్తుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ వరల్డ్ కప్ 2023లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చిన డిజిటల్ యాడ్స్ రెవిన్యూనే దీనికి ఉదాహరణ. 2023 క్రికెట్ వరల్డ్ కప్ కోసం డిజిటల్ పై 1000 ఇంప్రెషన్లకు రూ230 – 250 రూపాయల పరిధిలో ఉంది. 2019 ఎడిషన్ లో ప్రతి ఇంప్రెషన్లకు రూ.140 -150 తో పోలిస్తే 60 శాతం తక్కువ. వరల్డ్ కప్ కోసం ఈ సంవత్సరం టీవీలో ప్రకటనలు ఖర్చు 20% ఎక్కువగా ఉంటుందని అంచనా. అందులోనూ భారతదేశంలో పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటుంది.

ఇలాంటి ప్రీమియర్ కోసం 10 సెకన్ల రేట్లు దాదాపు రూ.30 లక్షలు ఉంటుంది. ప్రపంచ కప్ సానుకూల ప్రభావంతో సహా 2023 లో ప్రకటనలు పరిశ్రమ మొత్తం వృద్ధిరేటు ఎనిమిది – తొమ్మిది శాతం ఉంటుందని అంచనా వేసినట్లు ఎలారా క్యాపిటల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తైరాని తెలిపాడు. ఇక ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎక్కువ శాతం వృద్ధి వస్తుందని అంచనా. అక్టోబర్ 5 నుంచి షురూ కాబోతున్న ఐసీసీ ప్రపంచ కప్ 2023 అధికారిక ప్రసార, స్ట్రీమింగ్‌ భాగస్వామి అయిన డిస్నీ హాట్ స్టార్ ఇప్పటివరకు టోర్నమెంట్ కోసం 21 మంది స్పాన్సర్లు, 500 కంటే ఎక్కువ మంది అడ్వర్టైజర్లకు సైన్ చేశారట.

మహేంద్ర అండ్ మహేంద్ర, హిందుస్థాన్ యూనిలీవర్, ఏంఆర్ఎఫ్ టైర్స్, డ్రీం లెవెన్, బుకింగ్ డాట్ కాం లాంటి కొన్ని టోర్నమెంట్ స్పాన్సర్లుగా ఆల్రెడీ ఉన్నాయి. నాలుగేళ్లకు ఓసారి పురుషులు జాతీయ జట్లు పోటీపడే వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ 2023 అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తాజాగా 13వ ఎడిషన్కు ఇండియా హోస్ట్‌గా వ్యవహరిస్తుంది. ఈ మెగా టోర్నమెంట్ అక్టోబర్ 5న ప్రారంభమై నవంబర్ 19న ముగుస్తాయి.