చైతూ కథతో శర్వా కొత్త మూవీ.. సక్సెస్ అవుతారా..?

సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరోకి కథ అనుకొని.. ఆ తర్వాత మరో హీరోతో ఆ సినిమా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నాగచైతన్య చేయాల్సిన కథతో ఇప్పుడు శర్వానంద్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. సామజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు తన తదుపరి చిత్రాన్ని నాగచైతన్యతో చేయనున్నాడని మొన్నా మధ్య వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా శ్రీ విష్ణు తో ఈ సినిమా చేసిన రామ్ అబ్బరాజు ఏకంగా రూ.50 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్షన్లు కాబట్టి ఆయనకు మంచి విజయాన్ని అందించింది.

0

 

అటు శ్రీ విష్ణు కెరియర్ కు ఇటు రామ్ అబ్బరాజు కెరియర్ కు మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు. అంతేకాదు ఈ సినిమాపై రవితేజ , అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు కూడా ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ దర్శకుడికి ఇండస్ట్రీలో డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఆయన తదుపరి ప్రాజెక్టు ఎవరితో చేయబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారగా.. నాగచైతన్యతో ఆ సినిమా చేయనున్నాడని.. ఈ కథ విడాకుల నేపథ్యంలో ఉంటుందనే ప్రచారం కూడా జరిగింది . అయితే ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్ కాలేదని అప్పుడు నిలిపివేశారు.

అయితే ఇప్పుడు అదే కథను శర్వానంద్ దగ్గరికి తీసుకెళ్లగా ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ మూవీ అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని చెబుతున్నారు. మరి నాగ చైతన్య చేయాల్సిన ఈ కథ శర్వానంద్ చేయబోతున్నారు. మరి ఈ సినిమా కథతో శర్వానంద్ సక్సెస్ అవుతారా లేదా అన్నది చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు భాగస్వామ్యం కానున్నారట.