మహేష్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ రోజున గుంటూరు కారం ఫస్ట్ సాంగ్ రిలీజ్.. స్పెషల్ ఏంటంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దశాబ్దాలు దాటుతున్న.. అదే క్రేజ్ తో కొనసాగుతున్నాడు. వయసు మీద పడినప్పటికీ యంగ్ హీరోలకు దీటుగా గట్టి పోటీ ఇస్తూ వ‌ర‌స‌ విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోల లిస్టులో ఒకరిగా నిలిచిన మహేష్ బాబు ” గుంటూరు కారం ” సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.

త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా శ్రీ లీల, మీనాక్షి చౌదరి నటిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ దసరా పండగ సందర్భంగా రిలీజ్ చేస్తామని చెప్పినప్పటికీ అది జరగలేదు.

తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న బజ్ ప్రకారం నవంబర్ 7న త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఈ వార్త తెలియడంతో సూపర్ స్టార్ అభిమానులు సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. ఇక‌ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.