బిగ్ బాస్ హౌస్‌ లో 2 వారాల‌కు న‌టి పూజా మూర్తి సంపాదించింది మ‌రీ అంత త‌క్కువా?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 7 తెలుగు మంచి ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. కొత్త కొత్త టాస్క్ లు, ట్విస్ట్ లు, వైల్డ్ కార్డు ఎంట్రీలుతో బిగ్ బాస్ హౌస్ హీటెక్కిపోతోంది. తాజాగా ఏదో సీజ‌న్ లో ఏడు వారాలు కంప్లీట్ అయ్యాయి. అయితే ఈసారి మొద‌టి వారం నుంచి అమ్మాయిలే ఎలిమినేట్ అవుతూ వ‌స్తున్నాడు. ఏడో వారం కూడా అదే జ‌రిగింది.

అక్టోబ‌ర్ 22న సండే నాడు బిగ్ బాస్ షోలో దసరా, బతుకమ్మ సంబరాలు ఘ‌నంగా జ‌రిగాయి. ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ కూడా జ‌రిగింది. ఏడో వారం నామినేషన్స్ లో భోలే, అశ్విని శ్రీ, గౌతమ్ కృష్ణ‌, పూజా మూర్తి, టేస్టీ తేజా, ప‌ల్ల‌వి ప్రశాంత్, అమర్ దీప్ ఉండ‌గా.. వీరిలో పూజా మూర్తి ఇంటి బాట ప‌ట్టింది. ఐదో వారం వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి వ‌చ్చిన కంటెస్టెంట్స్ లో పూజా మూర్తి ఒక‌టి.

అయితే టాస్కుల్లో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వ‌క‌పోవ‌డం, అశ్వినితో అన‌వ‌స‌రంగా గొడ‌వ‌లు పెట్టుకోవ‌డం వంటి అంశాలు.. పూజా ఎలిమినేష‌న్ కు కార‌ణం అయ్యాయి. ఇక బిగ్ బాస్ హౌస్‌లో రెండు వారాలు ఉన్న పూజా మూర్తి సంపాదించింది కూడా త‌క్కువే అట‌. రెండు వారాల‌కు గానూ జెస్ట్ ఆమెకు రూ. 3 ల‌క్ష‌లు ఇచ్చార‌ట‌. అంటే వారానికి రూ.1.5 ల‌క్ష‌లు. హైస్ లో అతి త‌క్కువ రెమ్యున‌రేష‌న్ తీసుకున్న కంటెస్టెంట్స్ లో పూజా కూడా ఒక‌టి అంటున్నారు.