కార్తీ సినిమాలు హిట్ కావడం కోసం అలాంటి పని చేసిన భార్య..?

యుగానికి ఒక్కడు సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు కార్తి. ఈ సినిమాతో హిట్ కొట్టిన కార్తీ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఊహించిన రోజులో సక్సెస్ కాలేదు. కెరీర్ స్టార్టింగ్ లో వరుస ప్లాపులను ఎదుర్కొన్న కార్తీ తరువాత సరైన కథలను ఎంచుకుంటూ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. అయితే కార్తీ సినిమాలు హిట్ కావడానికి వెనుక అతని భార్య ఉందంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గతంలో వరుస ఫ్లాప్ లను ఎదుర్కొంటున్న కార్తీ జులై 3, 2014లో రంజని అనే వ్యక్తి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

వివాహం అయిన తర్వాత కూడా ఫ్లాప్స్ ఎదురవుతుండడంతో కార్తీ ఇంట్లో డల్ గా కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడట అప్పుడే అక్కడకు వెళ్లిన కార్తి భార్య రంజని ఏమైంది డల్ గా ఉన్నావ్ అని అడగగా.. నేను చేసిన సినిమాలు అన్ని ఫ్లాప్ అవుతున్నాయి. దానికి కారణం ఏంటో అర్థం కావడం లేదు అంటూ చెప్పుకొచ్చాడట. దీనికి స్పందించిన రంజని నీ నటనలో ఎటువంటి లోపం లేదు.. నీవు నటించే పాత్రకు 100% ఇస్తున్నావు.. కానీ నువ్వు ఎంచుకునే కథల విధానంలోనే తప్పు ఉంది. ప్రతిసారి లవ్ స్టోరీ నటిస్తుంటే ప్రేక్షకుల ఆసక్తి పోతుంది.

ఈసారి నీవు నటించే సినిమాలకు వైవిధ్యమైన కథలను ఎంచుకో అప్పుడు సినిమాలు కచ్చితంగా హిట్ అవుతాయి అంటూ సజెషన్ ఇచ్చిందట. ఆమె ఇచ్చిన ఈ సజెషన్ సిన్సియర్గా ఫాలో అయిన కార్తి డిఫరెంట్ స్టోరీస్ ని ఎంచుకుంటూ సినిమాల్లో నటించాడు. తర్వాత కార్తీ నటించిన అన్ని సినిమాలు దాదాపు హిట్గా నిలిచాయి. దీంతో రంజని రంజిని చేసిన ఆప్ పని వల్లే కార్తీ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో భార్య మాటకు గౌరవం ఇచ్చి ఆమె మాట విన్నాడు కాబట్టే కార్తీ లైఫ్ లో సక్సెస్ అవుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.