గ్రాండ్ గా బ్యాచిలర్ పార్టీ సెలబ్రేట్ చేసిన మెగా కోడలు.. పిక్స్ వైరల్..

మెగా ఇంట్లో కొద్దిరోజుల్లో ఘనంగా వరుణ్ తేజ్ – లావణ్య వివాహం జరగబోతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దలను ఒప్పించి వివాహ జీవితంలోనికి అడుగుపెట్టబోతున్నాడు. ఇక వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్టు వరుణ్ తేజ్ ఇదివరకే వివరించాడు. ఇటలీలోని తుస్కాని నగరంలో జరగబోతుందట. సోషల్ మీడియాలో సమాచారం ప్రకారం నవంబర్ 1వ తేదీన ఘ‌నంగా పెళ్ళితో ఒకటి కాబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే రామ్ చరణ్ – ఉపాసన తమ కూతురితో కలిసి ఇటలీకి వెళ్లారు.

తాజాగా వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి కూడా ఇటలీ బయలుదేరారట. మరికొద్ది రోజుల్లో మెగా కోడలిగా ఎంట్రీ ఇవ్వబోతున్న లావణ్య బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్ బై చెప్తూ గ్రాండ్గా పార్టీ సెలబ్రేట్ చేసింది. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ లావణ్య దిగిన ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పార్టీలో నితిన్ భార్య షాలిని, టాలీవుడ్ బ్యూటీ రీతు వర్మ, నిహారిక ఇలా పలువురు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ అయిన వెంటనే లావణ్య వరుణ్ తో కలిసి ఇటలీకి వెళ్ళిందట.

ఇక‌ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కాబోతున్నారు. మిస్టర్ సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు వీరిద్దరూ ప్రేమ విషయాన్ని ఒకరితో ఒకరు ఇటలీలోనే చెప్పుకోవడంతో వీరి వివాహం కూడా అక్కడే చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇక లావణ్య నిహారిక ఈ బ్యాచిలర్ పార్టీకి సంభంధించిన‌ ఫిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.