ఎన్టీఆర్ బామ్మర్ది నటించిన మ్యాడ్ మూవీ ఓటిటి డేట్ లాక్..!!

ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో అత్యధికంగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న చిన్న చిత్రం మ్యాడ్.. ఏన్నో పెద్ద సినిమాలు విడుదలై ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. అలాంటి సమయంలోనే చిన్న సినిమాగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది మ్యాడ్ చిత్రం. తమిళ డబ్బింగ్ సినిమా ఇరగకుమ్మాయి అనే చిత్రాన్ని తెలుగులో రీమిక్స్ చేయడం జరిగింది.దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయ దిశగా దూసుకుపోయింది.

ఇందులోని నటీనటులు మొత్తం కొత్త వారే ముఖ్యంగా ప్రముఖ హీరో శోబన్ తమ్ముడు సంగీత్ శోభన్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ కూడా ఇందులో నటించారు. యూత్ కి బాగా ఈ సినిమా కనెక్ట్ అవడంతో అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం 3 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ థియేటర్ బిజినెస్ జరగగా దాదాపుగా 7 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఓటీటి లో ఎప్పుడు విడుదలవుతుందా అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా థియేటర్లో విడుదలకు ముందే భారీ ధరకే నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అనుకున్నట్లుగా అగ్రిమెంట్ ప్రకారం నాలుగు వారాల లోపే ఓటీటిలో ఈ సినిమా విడుదల చేయాలి.. నవంబర్ 3వ తారీఖున ఈ సినిమా అన్ని భాషలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన త్వరలోనే విడుదల కాబోతోందట.