దిల్ రాజు ఇంట మోగనున్న పెళ్లి భాజాలు.. ఆ ప్రముఖ బిజినెస్‌మ్యాన్ తో వియ్యం..

ఈ ఏడది టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. కొద్దిరోజుల్లో వీరి పెళ్ళి ఇట‌లీలో జ‌ర‌గ‌నుంది. అలాగే వెంకటేష్ పెద్ద కూతురు హైవాహిని ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. సంగీత దర్శకుడు కీరవాణి అబ్బాయి శ్రీ సింహకు ప్రముఖ యాక్టర్ మురళీమోహన్ మనవరాలు రాగాతో పెళ్లి జరగనున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూస‌ర్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న దిల్ రాజు ఇంట పెళ్లి భాజాలు మోగుబోతున్నట్లు సమాచారం. దిల్ రాజు సోదరుడైన శిరీష్ కొడుకు ఆశిష్ రెడ్డి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడట.

అయితే ఇదివరకే రౌడీ బాయ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ ఈ సినిమాతో ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న‌ ఆశిష్‌ త్వరలోనే సెల్ఫిష్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం దిల్ రాజు, శిరీష్‌ల తండ్రి మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక చావు జరిగిన ఇంట్లో శుభకార్యం చేస్తే మంచి జరుగుతుందని అభిప్రాయంతో ఆశిష్ పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారట.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ప్రముఖ బిజినెస్ మ్యాన్ కుటుంబంతో దిల్ రాజు ఫ్యామిలీ వియ్యం అందుకుంటున్నట్లు సమాచారం. దిల్ రాజు నాన్నగారు మరణించక ముందే ఈ పెళ్లి చర్చలు జరిగాయట. వీరి పెళ్లి పూర్తిగా పెద్దలు కుదిరిచిన పెళ్లి అని తెలుస్తుంది. ఇక ఈ ఏడాది చివరలో ఎంగేజ్మెంట్ జరిపి వచ్చే ఏడాది మొదట్లో వివాహం చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ విషయంపై దిల్ రాజు కుటుంబం ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. కానీ త్వరలోనే అనౌన్స్మెంట్ ఇస్తార‌ని తెలుస్తుంది.