వ‌రుణ్ తేజ్ ఇంత ఫాస్ట్ గా ఉన్నాడేంట్రా బాబు.. పెళ్లికి ముందే అది కానిచ్చేశాడు!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ మ‌రికొద్ది రోజుల్లో త‌న బ్యాచిల‌ర్ లైఫ్ కు ఎండ్ కార్డు వేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠితో గ‌త ఐదేళ్ల నుంచి ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్న వ‌రుణ్ తేజ్‌.. ఇప్పుడు ఆమెతో ఏడ‌డుగులు వేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ జూన్ లో వీరి ఎంగేజ్మెంట్ వైభ‌వంగా జ‌రిగింది.

న‌వంబ‌ర్ 1న ఇట‌లీలో వ‌రుణ్ తేజ్‌-లావ‌ణ్య త్రిపాఠి డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం మట్కా, ఆపరేషన్ వాలెంటైన్ చిత్రాల్లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లె ఈ రెండు సినిమాలు సెట్స్ మీద‌కు వెళ్లాయి. అయితే పెళ్లికి ముందే వ‌రుణ్ స‌ర్‌ప్రైజింగ్ గా ఒక సినిమాను పూర్తి చేసేశాడు. యదార్థ సంఘటనల స్పూర్తితో తెలుగు, హిందీ బై లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా తెర‌కెక్కుతున్న ఆపరేషన్ వాలెంటైన్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన‌ట్లు తాజాగా వ‌రుణ్ అనౌన్స్ చేశాడు.

శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. మాజీ మిస్ యూనివర్స్‌ మానుషి చిల్లర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. వార్‌ డ్రామా నేపథ్యంలో సాగే ఈ సినిమాకు గుమ్మ‌డికాయ కొట్టేశారు. ఈ మేర‌కు వ‌రుణ్ తేజ్ అఫీషియ‌ల్ గా ఓ ట్వీట్ చేశాడు. అయితే ఇంత వేగంగా ఆపరేషన్ వాలెంటైన్ షూటింగ్ కంప్లీట్ అవ్వ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. వ‌రుణ్ తేజ్ ఇంత ఫాస్ట్ గా ఉన్నాడేంట్రా బాబు అని కామెంట్లు పెడుతున్నారు.