సౌందర్య ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ కన్నడ ముద్దుగుమ్మ కన్నడ ఇండస్ట్రీలో కన్నా తెలుగులో స్టార్ హీరోయిన్గా మారిపోయింది . ఆమె అందం ఆమె నటన ఆమె కట్టు బొట్టు అభిమానులను బాగా అలరించింది . ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్గా మార్చేశారు తెలుగు జనాలు . సినిమా ఇండస్ట్రీలో దాదాపు 100 సినిమాలకు పైగా నటించిన సౌందర్య అతి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.
కాగా సౌందర్య ఓ నటుడి విషయంలో చిరంజీవి దగ్గరకు వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది అన్న న్యూస్ మరోసారి వైరల్ గా మారింది . ఆ నటుడు మరెవరో కాదు సత్య ప్రకాష్. ఈయన టాలీవుడ్ లో దాదాపుకు 20కి పైగా సినిమాల్లో విలన్ రోల్స్ లో నటించి మెప్పించాడు . కాగా ఆయన ఎక్కువగా రేప్ సన్నివేశాలలో నటించడం అప్పట్లో అభిమానులకు భయం పుట్టించింది . ఆయన నటించడం చూసిన జనాలు నిజంగానే జీవించి పోయాడు అన్న రేంజ్ లో కామెంట్ చేశారు .
మరి ముఖ్యంగా ఆయన చూడాలని ఉంది సినిమా టైంలో సౌందర్య తో కూడా కలిసి అలాంటి ఓ సీన్ చేయాల్సి వచ్చిందట . అయితే ఇదే విషయాన్ని సౌందర్య చిరంజీవితో చెప్పి బాధపడిపోయిందట . ఆయనను చూసి భయమేసి పోయింది ..ఆయన వల్ల నా లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది అంటూ చిరంజీవికి కంప్లైంట్ ఇచ్చిందట . చాలా సినిమాల్లో పద్ధతిగా నటించిన సౌందర్య అలాంటి కామెంట్స్ చేసేసరికి చిరంజీవి సైతం షాక్ అయిపోయారట . ఇప్పటివరకు నేను ఎన్నో సీన్స్ చేశాను కానీ ఆయనతో చేసిన సీన్ నాకు చాలా చాలా ఇబ్బందికరంగా అనిపించింది అలాంటి పని చేసిన దుర్మార్గుడు వీడు అంటూ సౌందర్య చిరంజీవితో సత్య ప్రకాష్ గురించి ఘాటుగా చెప్పుకొచ్చిందట. అయితే ఆరోజు సత్య ప్రకాష్ సౌందర్య మాట్లాడిన మాటలను చాలా కాంప్లిమెంట్ గానే తీసుకున్నారట .