ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ల‌క్ష గెలుచుకున్న 100 మంది ల‌క్కీ ఫ్యాన్స్ వీళ్లే!

టాలీవుడ్ రౌడీ బాయ్, యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తాజాగా ఖుషి మూవీ తో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వైజాగ్ లో జరిగిన ఖుషి సక్సెస్ సెలబ్రేషన్స్ లో విజయ్ దేవరకొండ ఓ కీలక ప్రకటన చేశాడు. తన ఖుషి రెమ్యునరేషన్ లో కోటి రూపాయలను అభిమానులతో పంచుకుంటానని ప్రకటించాడు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో 100 కుటుంబాలను సెలెక్ట్ చేసి లక్ష రూపాయిలు చొప్పున చెక్కు రూపంలో తానే స్వయంగా అందిస్తానని విజయ్ దేవరకొండ ప్రకటించాడు. అయితే తాజాగా విజయ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. రిజిస్టార్ అవ్వండి అంటూ సోషల్ మీడియా ద్వారా ఒక ఫామ్ ను ఇవ్వ‌గా.. అందులో చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు.

అయితే వారిలో వందమందిని సెలెక్ట్ చేసి.. లక్ష గెల్చుకున్న 100 మంది లక్కీ ఫ్యాన్స్ వీళ్లే అంటూ పోస్టర్ రూపంలో విజయ్ సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఆ వందమంది ఫాన్స్ కుటుంబాలకు లక్ష చొప్పున చెక్‌ ఇవ్వబోతున్నట్టు పేర్కొన్నాడు. దీంతో నెటిజ‌న్లు విజయ్ దేవరకొండను మెచ్చుకుంటున్నారు. మాట నిలబెట్టుకున్నాడు అంటూ విజ‌య్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, గతంలో కూడా విజయ్ దేవరకొండ ఓ వంద మంది అభిమానులను సొంత ఖర్చులతో నార్త్ ఇండియా టూర్ కి పంపాడు. ఇప్పుడు మ‌రోసారి అభిమానుల ప‌ట్ల త‌న గొప్ప మ‌న‌సును చాటుకుని రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు.