వాట్సాప్ ఛానెల్ స్టార్ట్ చేసిన టాలీవుడ్ స్టార్స్‌.. భారీ ఫాలోయింగ్ తో దూసుకెళ్తున్న రౌడీ బాయ్‌!

ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో వినియోగ‌దారుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటుంది. ఇందులో భాగంగా ఇటీవల‌ వాట్సాప్ ఛానెల్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. భార‌త్ తో స‌హా మొత్తం 150 దేశాల్లో ఈ ఫీచ‌ర్ లో అందుబాటులోకి వ‌చ్చింది. ఇప్ప‌టికే ఫిల్మ్ ఇండిస్ట్రీకి చెందిన ప‌లువురు సెల‌బ్రిటీలు వాట్సాప్ లో ఛానెల్ ను క్రియేట్ చేసుకున్నారు. టాలీవుడ్ లో కూడా కొంత మంది స్టార్స్ వాట్సాప్ ఛానెల్ స్టార్ట్ చేశారు.

తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో మొట్ట మొద‌ట రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ వాట్సాప్ ఛానెల్ ను ప్రారంభించి భారీ ఫాలోయింగ్ తో దూసుకెళ్తున్నాడు. సెప్టెంబర్ 6వ తేదీన విజ‌య్ ఛానెల్ క్రియేట్ చేసుకున్నారు. 12వ తేదీ నుంచి వ‌రుస‌గా పోస్ట్‌లు పెడుతున్నారు. ఈయ‌న‌కు వాట్సాప్ ఛానెల్ లో 785కె అంటూ 7 ల‌క్ష‌ల 85 వేల మంది ఫాలోవ‌ర్స్ వ‌చ్చి చేరారు.

అలాగే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సెప్టెంబ‌ర్ 20న వాట్సాప్ ఛానెల్ ను స్టార్ట్ చేశాడు. ఈయ‌న ఇంత వ‌ర‌కు ఎలాంటి పోస్ట్ పెట్ట‌లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఛానెల్ ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 58 వేలు. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కూడా నిన్నే వాట్సాప్ ఛానెల్ ను క్రియేట్ చేశారు. ఆయ‌న్ను 29 వేల మంది ఫాలో అవుతున్నారు. ఇక ఇత‌ర భాష‌ల చెందిన స్టార్స్ విష‌యానికి అక్షయ్ కుమార్, కట్రీనా కైఫ్, మమ్ముట్టి, మోహన్ లాల్, సన్నీ లియోన్ వంటి వారు కూడా వాట్సాప్ ఛానెల్ ను ప్రారంభించారు.