హృతిక్ రోషన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మెగాస్టార్ మూవీ..!

బాలీవుడ్ టాప్ మోస్ట్ స్టార్ హీరో హృతిక్ రోషన్. ఇతడికి బాలీవుడ్ ఇండస్ట్రీలో కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ముద్దుగా గ్రీక్ గాడ్ అని హాలీవుడ్ యాక్షన్ హీరో అని పిలుస్తూ ఉంటారు బి టౌన్ ప్రేక్షకులు. ఇక హృతిక్ రోషన్ ఏదైనా యాక్షన్ మూవీలో నటించాడంటే ఖాన్‌ల‌ స్టార్ స్టేటస్ కూడా ఇతని ముందు నిలబడదు అంటూ ఉంటారు. ఇక తెలుగులో కూడా హృతిక్ రోషన్ నటించిన పలు సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. అదే విధంగా హృతిక్ రోషన్ హీరోగా పరిచయం కాకముందే కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడు.

ఇతడు ప్రముఖ నిర్మాత నటుడు రాకేష్ రోషన్ కుమారుడుగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు. చిన్నప్పటినుండి నటన అంటే పిచ్చి.. తండ్రిని మించి పలు సినిమాల్లో నటించిన హృతిక్ రోషన్ అప్పట్లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన భగవాన్ దాదా అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. ఈ సినిమాలో రజనీకాంత్ తో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే అప్పట్లో ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేద్దామనుకున్నారు రాకేష్ రోషన్. అత‌డి నిర్మాణంలోనే ప్రముఖ డైరెక్టర్ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను ప్రారంభించారు.

ఇక మాతృక భాషలో బాల నటుడుగా నటించిన హృతిక్ రోషన్ తెలుగు సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిసిగా నటించాడు. అయితే కొంతకాలం షూటింగ్ తర్వాత బడ్జెట్ అనుకున్న దానికంటే లిమిట్ దాటి పోయిందట. అప్పట్లో కోటి రూపాయలు అంటే ఇప్పుడు రూ.100 కోట్లతో సమానం. అలాంటిది ఈ సినిమాకు దాదాపు రూ.3 కోట్ల బడ్జెట్ అయిపోతుందని దీంతో ఈ సినిమాని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఒకవేళ ఈ సినిమా చేసి ఉంటే చిరంజీవి – హృతిక్ రోషన్ కాంబినేషన్లో వచ్చిన ఏకైక తెలుగు సినిమాగా ఈ సినిమా రికార్డులో నిలిచిపోయేది అంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.