మీ సరసాలు తగలెయ్య…. రతిక, యావర్ పై మండిపడ్డ ప్రశాంత్ (వీడియో)

రోజురోజుకు బిగ్ బాస్ రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఇప్పుడు మూడో వారంలోకి సక్సెస్ఫుల్గా ఎంట్రీ ఇచ్చాడు. కంటెస్టెంట్స్ పోటా పోటీగా తలపడుతున్నారు. ఇప్పటివరకు సందీప్, శివాజీ మాత్ర‌మే ప‌వ‌ర్ అస్త్ర గెలుచుకున్ని హౌస్ కంటిండ‌ర్లుగా నిలిచారు… ఈవారం హౌస్ మేట్స్ అయ్యేందుకు ఒక్కొక్కరు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ మూడో కాంటెండర్ అయ్యే ఛాన్స్ అమర్దీప్, శోభా శెట్టి, ప్రిన్స్ కి ఇచ్చాడు.

ఈ ముగ్గురిలో ఎవరు పవర్ అస్త్రాకు అర్హులు కాదో.. కన్ఫెషన్ రూమ్ లో చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించాడు. దీంతో మిగిలిన కంటెస్టెంట్స్ వెళ్లి ఒక్కొక్కరు ఒకరి పేరు చెబుతారు. ఇక ప్రిన్స్.. రతిక నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా అని అడుగుతాడు. సపోర్ట్ చేస్తాను అని చెప్పినట్టు చెప్పిన రతిక.. కన్ఫెషన్ రూమ్ లో మాత్రం ప్రిన్స్ యావర్ అనర్హుడని చెప్పింది. కన్ఫెషన్ రూమ్‌లో ఎవరెవరు ఎవరి పేర్లు చెబుతారో బిగ్ బాస్ వీడియోలు బహిర్గతం చేస్తాడు.

అప్పుడు రతిక యావర్ అనర్హుడు అని చెప్పడం చూసి… ప్రిన్స్ తో పాటు అందరూ షాక్ అవుతారు. అయితే.. ఇంత మోసం జరిగిన యావర్,రతికతో ఎప్పటిలాగే మాట్లాడడం ఆశ్చర్యం. అంతేకాకుండా నీకు ఏమైనా నేనున్నా అంటూ హామీలు ఇచ్చాడు. కిచెన్ లో ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్ జరగగా.. అది చూసిన పల్లవి ప్రశాంత్ మీ సరసాలు తగలెయ్య అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు.