యువకుడిగా మారెందుకు జగపతిబాబు షాకింగ్ ప్రయత్నాలు.. ఫోటో వైరల్..

ఒకప్పటి హీరో ఇప్పటి మోస్ట్ వాంటెడ్ విలన్ జగపతి బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒక ప్రముఖ నిర్మాత వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జగపతిబాబు కెరీర్ ప్రారంభంలో ఎన్నో మంచి సినిమాల్లో నటించారు. అయినా కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. అలా అని వెనకడుగు వేయకుండా ప్రయత్నిస్తూ హీరోగా మంచి గుర్తింపు సంపాదిస్తున్నారు. ఒకవైపు ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకొని మరోవైపు యాక్షన్ సినిమా లో ఆదరగొట్టాడు. ఒకప్పుడు టాలీవుడ్ లో హ్యాండ్సమ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జగపతిబాబు ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు.

ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో స్టైలిష్ విలన్ గా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే కేవలం విలన్ గానే కాకుండా ఫాదర్,బ్రదర్ లాంటి స్పెషల్ రోల్స్ లో కూడా నటిస్తున్నాడు. బాలకృష్ణ హీరోగా నటించిన ఒక సూపర్ హిట్ సినిమాతో విలన్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టాడు జగపతి బాబు. ప్రస్తుతం ఆయన సినిమాలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాడు. సోషల్ మీడియాలో తలచు ఏదో ఒక పోస్ట్ పెడుతూ అభిమానులను అలరిస్తూ ఉన్నాడు. తాజాగా జగపతిబాబు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో బాగా వైరల్ అయిపోతుంది.

గతంలో కూడా తన ఇంస్టాగ్రామ్ పేజీ ద్వారా జగపతి బాబు ఒక ఫోటో ని షేర్ చెయ్యగా అభిమానులు క్రేజీ కామెంట్స్ చేసారు. మీ వయసు ఎంత పెరిగిన ఇంకా కుర్రాడిలానే కనిపిస్తున్నారు అంటూ చాలా మంది కామెంట్స్ చేసారు. ప్రస్తుతం వారి మాటలను నిజం చేసేందుకు రెడీ అయ్యాడు మనం స్టైలిష్ విలన్. ఆయన ముఖానికి మెకప్ వేసుకొని, ఏ తరువాత ఒక టిష్యు పేపర్ ని ముఖాపై కప్పుకొని ఫన్నీ గా కనిపించాడు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘ ఇంతకుముందు నేను పింక్ డ్రెస్ లో ఉన్న ఫోటోని షేర్ చేస్తే మీరంతా యంగ్ కుర్రాళ్ళ ఉన్నారు అంటూ కామెంట్ చేశారు. అందుకే నేను ఎచ్చులకుపోయి నిజంగానే కుర్రాడిలా మారిపోదాం అని ట్రై చేస్తున్నాను ‘ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.