సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు సెట్ అయినట్లే అయ్యి మిస్ అయిపోతూ ఉంటాయి. అలాంటి ఓ క్రేజీ కాంబోనే సమంత – ప్రభాస్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత – ప్రభాస్ తో సినిమా చేయాల్సి ఉండింది . అంతా సెట్ అయింది. కాని కుదిరినట్టే కుదిరి లాస్ట్ మూమెంట్లో ప్రభాస్ ప్లేస్ లోకి మరోస్టార్ హీరో వచ్చాడు.
ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఆ సినిమా మరేదో కాదు రంగస్థలం . సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా ఎంత పెద్ద విజయం అందుకుంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సమంత ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది . రామ్ చరణ్ ఈ సినిమాలో హీరోగా కనిపించి మెప్పించాడు. అయితే ఈ కథలో ముందుగా హీరోగా ప్రభాస్ ని ఊహించుకున్నారట సుకుమార్ .
కానీ అప్పటికే ఫుల్ కాల్ షీట్స్ తో బిజీబిజీగా ఉన్న ప్రభాస్ ఈ కథను రిజెక్ట్ చేశాడు . ఆ తర్వాత ఈ కథ పలువురు హీరోల వద్దకు వెళ్ళిన ఫైనల్లీ రాంచరణ్ చేతికే వచ్చి చేరింది . అలా ప్రభాస్ సమంత కాంబోలో ఓ సినిమా మిస్ అయింది..!!