తెలుగు బుల్లితెర మీద యాంకర్ సుమ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. బుల్లితెరపై క్వీన్ గా ఒక వెలుగు వెలుగుతోంది సుమ. స్టార్ మా, జెమినీ, ఈటీవీ, జీ తెలుగు ఇలా ఏ ఛానల్ లో అయినా సరే ఎంటర్టైన్మెంట్ షో అంటే కచ్చితంగా సుమ యాంకరింగ్ చేయాల్సిందే అనెంతగా పాపులర్ అయింది. అలాగే పలు చిత్రాలలో కూడా నటించి బాగానే క్రేజీ సంపాదించింది సుమ.
ఇండస్ట్రీలో ఉన్న ప్రారంభం నుంచి నేటి తరం వరకు కొత్త యాంకర్లు ఇండస్ట్రీలోకి వస్తూ ఉన్నారు. కానీ సుమ రేంజ్ను మాత్రం అందుకోలేక పోతున్నారు .అందుకే ఈమెను యాంకరింగ్ రంగంలో మెగాస్టార్ అని పిలుస్తూ ఉంటారు.. ముఖ్యంగా ఈమె వేసే పంచులకు కూడా అందరిని కడుపుబ్బ నవ్వించేలా ఉంటాయి. సుమ వ్యక్తిగత విషయానికి వస్తే నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి మరి వివాహం చేసుకుంది సుమ.. వీరిద్దరి పరిచయం కస్తూరి సీరియల్ ద్వారా పరిచయమయ్యిందట. వీళ్ళ పెళ్లి సులువుగా జరగలేదని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది సుమ.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుమ మాట్లాడుతూ.. రాజీవ్ కనకాలని ప్రేమిస్తున్నట్లు తన ఇంట్లో చెప్పగానే తమ కుటుంబ సభ్యులు అసలు ఒప్పుకోలేదట. కానీ రాజీవ్ కనకాల కుటుంబంలో ఈమెతో వివాహాన్ని ఒప్పుకున్నారట.. అయితే రాజీవ్ కనకాలతో మాట్లాడడానికి వీలు లేదని సుమని ఒక గదిలో ఒక వారం రోజులపాటు నిర్బంధించినట్లు తెలియజేసింది దీంతో తనని ప్రేమించిన వాడిని తలుచుకుంటూ ఏమి తినకుండా అలాగే ఉండిపోయానని చివరికి ఆ టార్చర్ భరించలేక ఇంటి నుంచి పారిపోదామా అనుకునే స్టేజ్ కి వెళ్లిపోయానని తెలియజేసినట్టు సమాచారం.
కానీ చివరికి వీటన్నిటిని గమనించిన తల్లితండ్రుల సైతం వారి ప్రేమను ఒప్పుకొని వివాహ చేశారని తెలిపింది సుమ అలా వీరి దాంపత్య జీవితం ప్రారంభమై ఇప్పటికి అన్యోన్యంగా కొనసాగుతూనే ఉన్నారు.